వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: సీఎంవోకు కంపెనీల భారీ విరాళం, కేసీఆర్‌కు చెక్కులు అందజేత..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉండగా.. రాష్ట్రంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కూడా విధించారు. కానీ రోజు రోజుకు పాజిటివ్ కేసులు మాత్రం పెరుగుతుండటం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య మూడు పెరిగి.. మొత్తంగా 44కి చేరింది. మరోవైపు వైరస్‌ ప్రబలుతోన్న కంపెనీలు ప్రభుత్వానికి ఆర్థికసాయం ప్రకటించాయి.

 Coronavirus: industrialists gave cheque to cm kcr

శాంతా బయోటెక్ రాష్ట్ర ప్రభుత్వానికి విరాళం అందజేసింది. కంపెనీ అధినేత పద్మభూషణ్ కేఐ వరప్రసాద్ రెడ్డి రూ.కోటి నగదు ప్రకటించారు. గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిసి చెక్కు అందజేశారు. కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత కామిడి నర్సింహరెడ్డి తమ కంపెనీ తరపున కోటి రూపాయాల చెక్కు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు.

లారస్ ల్యాబ్స్ సీఈవో డాక్టర్ సత్యనారాయణ, ఈడీ చంద్రకాంత్ రెడ్డి రూ.50 లక్షల చెక్కును సీఎం కేసీఆర్‌కు అందజేశారు. దీంతోపాటు తమ ల్యాబ్ తరఫున లక్ష హైడ్రాక్సి క్లోరోక్విన్ టాబ్లెట్లను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ సీఎం కేసీఆర్‌కు రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. చెక్కును కంపెనీ ఎండీ పీవీ కృష్ణారెడ్డి అందజేశారు. మీనాక్షి గ్రూపు సీఎం సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందజేసింది.

English summary
some industrialists gave cheque to cm kcr fight against Coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X