కొత్తగూడెం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా:కొత్తగూడెం డీఎస్పీపై హైడ్రామా ..వ్యాధి తగ్గకుండానే డిశ్చార్జ్.. షాకింగ్ ట్విస్ట్..చదవాల్సిందే

|
Google Oneindia TeluguNews

విదేశాల నుంచి వైరస్ మోసుకొచ్చిన కొడుకుతో కలిసి ఊళ్లు తిరగడమేకాకుండా.. స్వతహాగా పోలీస్ అయి ఉండి, క్వారంటైన్ నిబంధనల్ని అతిక్రమించి, సస్పెండైన కొత్తగూడెం డీఎస్పీ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. కరోనా తీవ్రత ఇంకా తగ్గకముందే ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి తప్పుచేసింది ఆయన కాదు.. సాక్ష్యాత్తూ వైద్య సిబ్బందే పప్పులో కాలేయడం ద్వారా చిన్నపాటి ప్రమాదం తలెత్తింది. గురువారం నుంచి శుక్రవారం దాకా ఆయన చుట్టూ పెద్ద హైడ్రామా నడిచింది.

డీఎస్పీ డిశ్చార్జ్

డీఎస్పీ డిశ్చార్జ్


సంచలనాత్మక కేసు కావడంతో కొత్తగూడెం డీఎస్పీ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తూ వచ్చారు. కొడుకు ద్వారా వైరస్ సోకిన ఆయన, ఇన్నాళ్లూ హైదరాబాద్ లోని చెస్ట్ ఆస్పత్రిలో చికిత్సపొందారు. ఐసోలేషన్ గడువు ముగియడంతో ఆస్పత్రిలో అందరికీ టెస్టులు నిర్వహించారు. గురువారం వెల్లడైన ఫలితాల్లో సదరు డీఎస్పీకి నెగటివ్ అని తేలింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఆయనను డిశ్చార్జి చేసి ఇంటికి పంపారు. డీఎస్పీ డిశ్చార్జి విషయాన్ని ఉన్నతాధికులు కూడా మీడియాకు ధృవీకరించారు. కానీ కొద్ది గంటలకే సీన్ రివర్స్ అయింది.

భారీ తప్పిదం..

భారీ తప్పిదం..


హైదరాబాద్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆ డీఎస్పీ.. ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకుని కొత్తగూడెంలోని తన ఇంటికి వెళ్లిపోయారు. తీరా ఆస్పత్రి సిబ్బంది లిస్టును రీచెక్ చేసుకోగా.. డీఎస్పీకి ఇంకా వ్యాధి తగ్గలేదని, ఆయన పాజిటివ్ పేషెంట్ అనే ఉన్నట్లు గుర్తించారు. సరిగ్గా డీఎస్పీ పేరుతోనే అదే ఆస్పత్రిలో మరో పేషెంట్ ఉండటంతో ఇద్దరి రిపోర్టులు తారుమారైనట్లు తెలుసుకున్నారు. జరిగింది ఎంత పెద్ద తప్పో తెలిసిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో..

అర్థరాత్రి తర్వాత ఉరుకులు..

అర్థరాత్రి తర్వాత ఉరుకులు..


అదే పేరుగల వేరే వ్యక్తి బదులు ఇంకా పాజిటివ్ గానే ఉన్న కొత్తగూడెం డీఎస్పీ డిశ్చార్జ్ అయ్యారన్న సంగతి అధికార వర్గాలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. హైదరాబాద్ అధికారులు హుటాహుటిన కొత్తగూడెంలోని పోలీసులకు సమాచారం చేరవేశారు. దాంతో స్థానిక పోలీసులు అర్థరాత్రి దాటిన తర్వాత ఉరుకులు పరుగుల మీద డీఎస్పీ ఇంటికి వెళ్లారు. అప్పటికప్పుడు సేఫ్ గార్డ్స్ పెట్టించి, అంబులెన్స్ లో తిరిగి హైదరాబాద్ కు పంపారు. ఈసారి ఆయనను చెస్ట్ ఆస్పత్రికి కాకుండా గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మళ్లీ మొదటి నుంచి..

మళ్లీ మొదటి నుంచి..

కొవిడ్-19 నుంచి కోలుకోక ముందే పొరపాటున డిశ్చార్జ్ అయిన డీఎస్పీ.. ఆస్పత్రి నుంచి బయటికొచ్చినప్పటి నుంచి ఎవరెవర్ని కలిశాడు, ఏ వాహనంలో వెళ్లాడు, మధ్యలో ఏమేం చేశారు, ఇంట్లో ఎవరెవర్ని కలిశారు అనే విషయాల్ని అధికారులు ఆరా తీశారు. ముందు జాగ్రత్తగా వాళ్లందరినీ క్వారంటైన్ లో ఉంచాలని నిర్ణయించారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. అయితే వ్యాధి తగ్గకుండా ఆయన్ని ఎలా డిశ్చార్జ్ చేశారు? దగ్గు, జ్వరం, శ్వాస ఇబ్బంది లాంటి లక్షణాలు ఉంటాయి కదా? అనే సందేహాలకు డాక్టర్లు వివరణ ఇచ్చారు..

అందుకే తప్పనిసరి మాస్క్..

అందుకే తప్పనిసరి మాస్క్..

కొత్తగూడెం డీఎస్పీకి ఇంకా కొవిడ్-19 వ్యాధి తగ్గనప్పటికీ.. వ్యాధి లక్షణాలు మాత్రం బయటికి తెలియలేదు. ఆయనొక్కడికే కాదు.. ప్రపంచ వ్యాప్తంగానూ ఈ తరహా ఘటనలు అనేకం రికార్డవుతున్నాయి. వ్యాధి లక్షణాలు బయటపడకుండానే చాలా మంది పాజిటివ్ అని తేలుండటాన్ని డాక్టర్లు గుర్తించారు. దీన్నే వైద్య పరిభాషలో ‘అసింప్టమాటిక్(లక్షణాలు బయటపడకుండా రోగానికి గురికావడం)' అంటారు. చైనాలో ఈ తరహా కేసుల్ని ‘కరోనా సెకండ్ వేవ్'గా పరిగణిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లేగే తెలంగాణలోనూ ఆ తరహా కేలుసు బయటికొస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అందుకే లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. మాస్క్ వాడకాన్ని తప్పనిసరి చేసింది. అలాగే,

Recommended Video

Lockdown : Trains Likely To Available From 15th April
లాక్ డౌన్ కొనసాగింపు కూడా..

లాక్ డౌన్ కొనసాగింపు కూడా..


తెలంగాణ ప్రభుత్వం మాస్క్ వాడకాన్ని తప్పనిసరి చేయడానికి కొద్ది గంటల ముందే ఢిల్లీ, ముంబై, యూపీ, లడాక్ లోనూ ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. మాస్కు లేకుండా బయటికొచ్చిన 34 మందికి ఢిల్లీలో ఫైన్లు కూడా విధించారు. అసింప్టమాటిక్ కేసుల్ని కనిపెట్టడం సవాలుతో కుడుకున్నది కాబట్టే ప్రభుత్వాలు ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అంతేకాదు, తెలంగాణలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. పరిస్థితి ఇలా మలుపు తిరిగింది కాబట్టే తెలంగాణ సహా చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ కనసాగించాల్సిందేనని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి. కేంద్రం నుంచి ప్రకటన రాకముందే ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు మే 1 వరకు లాక్ డౌన్ కొనసాగింపునకు ఆదేశాలు జారీచేశాయి. శనివారం సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ప్రధాని మోదీ లాక్ డౌన్ పై అధికారిక ప్రకటన చేయనున్నారు.

English summary
Kothagudem DSP who discharged from Chest Hospital, called back to gandhi hospital after authorities found that he is positive for coronavirus and mistakenly released instead of another man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X