వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా లాక్‌డౌన్: బ్లడ్‌బ్యాంక్‌ల్లో డ్రై స్టేజీకి రక్తం, ‘తలసేమియా’ పేరంట్స్ ఆగచాట్లు, ‘ఏబీ’ గ్రూపు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లడమే గగనమైపోయింది. దీంతో బ్లడ్ బ్యాంకులు కూడా డ్రై స్టేజీకి వచ్చాయి. ఇప్పటికే ఉన్న నిల్వలను ఆడపా దడపా వాడుతుండటంతో.. తెలంగాణ రాష్ట్రంలో గల బ్లడ్ బ్యాంకుల్లో రక్తం లేని పరిస్థితి ఏర్పడింది.

500 నుంచి 1000 యూనిట్లు

500 నుంచి 1000 యూనిట్లు


కరోనా వైరస్ సోకిన వారికి రక్తం అవసరమవుతుండటంతో.. ఇతర వ్యాధులొచ్చే వారికి ప్రయారిటీ తగ్గించారు. ముఖ్యంగా 60 శాతం తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం కొరత ఏర్పడింది. రాష్ట్రంలో ఒక్కో బ్లడ్ బ్యాంక్‌కు నెలకు 500 నుంచి 1000 మందికి రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. రోగుల బంధువులు రక్తం ఇచ్చి, తమకు అవసరమైన రక్తం తీసుకునేవారు. అత్యవసరం ఉన్న వారు మాత్రమే బ్లడ్ బ్యాంకు నుంచి రక్తం తీసుకునేవారు. తలసేమియా వ్యాధి ఉన్న చిన్నారుల పేరెంట్స్ రక్తం సేకరించేవారు. కానీ ప్రస్తుతం రక్తం సేకరించడం కష్టమవుతోంది.

డొనర్ దొరికినా..

డొనర్ దొరికినా..


ఇప్పటికే తాను మూడు బ్లడ్ బ్యాంక్‌లకు ఫోన్ చేశానని.. కానీ స్టాక్ లేదని చెప్తున్నారని ఓ పేరెంట్ పేర్కొన్నారు. ఓ బ్లడ్ డోనర్ ముందుకొచ్చారని వాసుదేవ అనే పేరంట్ చెప్పారు. కానీ అతనిని ఆస్పత్రికి తీసుకురావడం గగనమైపోతుందని చెప్పారు. లాక్ డౌన్ సందర్భంగా రానీయడం లేదని.. ఒకవేళ రావాలనుకుంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోందని చెబుతున్నారు.

డ్రై.. డ్రై...

డ్రై.. డ్రై...

చాలా బ్లడ్ బ్యాంకుల్లో ఏబీ పాజిటివ్ రక్తం లేనే లేదు. డోనర్లు కూడా లేకపోవడంతో సమస్య తలెత్తుతోంది. ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కువగా ఉంటుంది. డోనర్లు కూడా లభిస్తారు. కానీ తమకు డోనర్లు లేనేలేరని మరో పేరంట్ వేణి శ్రీనివాస్ పేర్కొన్నారు. తమ వద్ద బ్లడ్ నిల్వ లేదని దాదాపు అన్నీ బ్లడ్ బ్యాంకులు చెబుతున్నాయి. వాస్తవానికి నెల రోజులకు 70 నుంచి 80 యూనిట్ల రక్తాన్ని తలసేమియా రోగుల కోసం బ్లడ్ బ్యాంకు కేటాయించేంది. 20 యూనిట్లను తాము ఇచ్చేవారిమని మధర్ థెరెసా బ్లడ్ బ్యాంక్, తలసేమియా సెంటర్ వెల్లడించింది.

Recommended Video

Lockdown Continue Till June Or September Says BCG | Opinions
లాక్ డౌన్

లాక్ డౌన్


ప్రస్తుతం కాలేజీలు, క్లబ్బులు మూసివేయడంతో రక్తదానం కోసం క్యాంపులు వేయడం కుదరలేదని చెబుతున్నారు. ఒకవేళ క్యాంపు వేస్తే 500 యూనిట్ల రక్తం సమకూరుతోంది... ఒక్కో యూనిట్‌కు 150 యూనిట్ల రక్తం ఉపయోగించే వెసులుబాటు ఉంటోంది.

English summary
telangana Blood banks run dry as donations dip due to coronavirus lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X