హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

corona: పోలీసులిక దండం పెట్టరు! ధరలు పెంచితే కఠిన చర్యలు, మీడియా పట్ల జాగ్రత్త

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హోం క్వారంటైన్ పై గట్టి నిఘా పెట్టామని, బయట తిరిగితే పాస్ పోర్టు సీజ్ చేయమని ఆదేశించామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. సమాజానికి భంగం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం రాత్రి ఆయన కరోనా నియంత్రణపై మీడియాతో మాట్లాడారు.

ధరలు పెంచితే కఠిన చర్యలు

ధరలు పెంచితే కఠిన చర్యలు

కూరగాయల ధరలు పెంచినట్లు తెలిసిందని.. ఇది బాధాకరమని అన్నారు. వినియోగానికి మంచి ఉత్పత్తి ఉందని.. రేపట్నుంచి ఎక్కువ ధరకు అమ్మితు పీడీయాక్టు ప్రయోగిస్తామని, జైలుకు పంపుతామని సీఎం కేసీఆర్ హెచ్చరికలు చేశారు.

నిత్యావసర ధరలు పెంచితే దుకాణాలు సీజ్ చేస్తామన్నారు. పర్మినెంట్ ట్రేటర్ కింద పెడుతామని, షాపుల లైసెన్స్ క్యాన్సల్ చేస్తామన్నారు. ఇలాంటి సమయంలో ప్రజల జేబులు కొల్లగొడతారా? అని మండిపడ్డారు. అమెరికా లాంటి దేశంలోనే కరోనా కట్టడి కోసం షూట్ ఎట్ సైట్ ఆదేశాలు జారీ చేస్తున్నారని, అక్కడ 45వేల మంది కరోనా బారిన పడ్డారని సీఎం కేసీఆర్ తెలిపారు. మనరాష్ట్రం నుంచి ఎవరూ ఎటూ పోవాల్సిన పనిలేదన్నారు. దండం పెట్టి చెబుతున్నా ప్రజలంతా సహకరించాలన్నారు. కరోనా కట్టడికి మీడియా కూడా సహకరిస్తోందన్నారు.

రోడ్లపైకి రావొద్దు..కానీ, పోలీసులు ఇక దండం పెట్టరు..

రోడ్లపైకి రావొద్దు..కానీ, పోలీసులు ఇక దండం పెట్టరు..

రాత్రి 7 నుంచి మార్నింగ్ 6 వరకు కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు. ఇబ్బంది ఉంటే డయల్ 100కు కాల్ చేయాలన్నారు. మనిషి వీధిలోకి వస్తే కఠిన చర్యలుంటాయని, బతిమాలే పరిస్థితులు లేవన్నారు. పోలీసులు ఇప్పటి వరకు దండం పెట్టారు.. ఇప్పుడు దండాలు పడతారని అన్నారు. 6గంటల తర్వాత షాపులు ఓపెన్ ఉంటే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం జరగాలి. పాలు రావాలి, పోలానికి నీళ్లు పెట్టాలి. వ్యవసాయ పనులకు అనుమతిస్తున్నాం. గంపులు గుంపులుగా కాకుండా పద్దతిగా పనిచేసుకోవాలి. నరేగా పనులు కూడా ఇదేవిధంగా అనుమతిస్తున్నామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అనుమతి ఉందని, కాంట్రాక్టర్లు శానిటైజేషన్ చర్యలు తీసుకోవాలన్నారు.

డాక్టర్లను కాపాడుకోవాలి.. పోలీసులు ఎక్జాస్ట్ కావొద్దు.. మాకు దు:ఖమే కానీ..

డాక్టర్లను కాపాడుకోవాలి.. పోలీసులు ఎక్జాస్ట్ కావొద్దు.. మాకు దు:ఖమే కానీ..

కొన్ని గ్రామాలకు కంచెలు వేసుకున్నారని, ఇది మంచి పద్ధతి అన్నారు. పట్టణాలు కూడా బాగున్నాయని తెలిపారు. జంట నగరాల మూడు కమిషనరేట్ల పరిధిలో పరిస్థితులు కంట్రోల్ లోకి వచ్చాయన్నారు. ప్రజలు నియంత్రణ పాటించాలన్నారు.

వ్యాధి కంట్రోల్ లోనే ఉందని.. లోకల్ ట్రాన్సిమిట్ కేసు నమోదు కాలేదని అన్నారు.
పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైళ్లు, విమానాలు బంద్ అయినాయని.. 30 రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఉందని అన్నారు. విదేశీయుల నుంచి వచ్చిన వ్యాధిని వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. మన రాష్ట్రంలో పరిమిత సంఖ్యలోనే డాక్టర్లు ఉన్నారని, వారిని కాపాడుకోవాలన్నారు. ఉన్న డాక్టర్లను కాపాడుకోవాలి.. వారిని అలిసిపోనివ్వకూడదన్నారు. పోలీసులు కూడా ఎక్జాస్ట్ కావొద్దని అన్నారు. డేటైంలో ప్రజలు బలాదూర్ గా తిరగొద్దన్నారు. నాలుగు రోజులు ఇళ్ళలో ఉంటే సరిపోతుందన్నారు. నిత్యావసరాల కోసం 3కి.మీ ప్రయాణించవచ్చన్నారు. ప్రభుత్వానికి కూడా ఇలా బంద్ చేయడం దు:ఖమే.. కోట్ల నష్టం వస్తున్నా ప్రజా క్షేమం కోసమే చేస్తున్నామన్నారు. ఆరోగ్య శాఖకు నిధుల కొరత రావొద్దన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ తమకు తాము నియంత్రణ చేసుకోవాలన్నారు.

మీడియా పట్ల పోలీసులూ జాగ్రత్త.. ప్రజల కోసమే..

మీడియా పట్ల పోలీసులూ జాగ్రత్త.. ప్రజల కోసమే..

పోలీసులు, జర్నలిస్టుల గొడవపై స్పందిస్తూ.. ప్రభుత్వం మీడియాకు అనుమతిచ్చిందని.. వారితో పోలీసులు దురుసుగా ప్రవర్తించకూడదని అన్నారు. మీడియావారు అపార్థం చేసుకోవద్దన్నారు. వార్తలు ప్రజలకు చేరాలంటే మీడియా తిరగాలని, అందుకే అనుమతివ్వాలని స్పష్టం చేశారు. మీడియాను ఆపోద్దని స్పష్టం చేశారు. మీడియాకు ప్రభుత్వ అనుమతి ఉందని.. పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రష్యా దేశం తమ ప్రజలను అద్భుతంగా కాపాడుకుందని.. ఇంట్లోనే కాలుమీద కాలేసుకుని కూర్చుంటారా? లేక బయటికి వచ్చి ఐదు నెలలు జైల్లో ఉంటారా? అని ఆ దేశాధ్యక్షుడు స్పష్టం చేశారన్నారు. దీంతో ఎవరూ బయటకు రాలేదన్నారు. మీ బిడ్డగా చెబుతున్నా.. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం అంతా సహకరించాలన్నారు. అధికారులు, పోలీసులకు నిద్రలుంటలేవన్నారు. బియ్యం ఎల్లుండిని పంపిణీ చేస్తామన్నారు. రూ. 1500 అకౌంట్లో వేస్తామని, వివరాలు సేకరిస్తామన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు కరోనాపై వివరించాలని, ధరలు ఎక్కువగా పెంచకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

English summary
coronavirus: telangana cm key suggestions to people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X