హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖాకీ కన్నేస్తే..: ఇదో అడ్డగోలు పోలీస్ దందా?, రెచ్చిపోతున్న వసూల్ రాజాలు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటూ తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాటలకు ఖాకీలు తూట్లు పొడుస్తున్నారు. సామాన్యుడి పట్ల జులుం సంగతి పక్కనపెడితే.. వ్యాపారులను అందినకాడికి దోచుకోవడమే ధ్యేయంగా కొంతమంది వసూల్ రాజాల అవతారం ఎత్తారు. వీళ్ల వ్యవహారాలకు పై స్థాయి అండదండలు ఉండటంతో సలాం కొట్టేవాళ్లే తప్పితే.. వీరికి అడ్డు చెప్పేవారే లేకుండా పోయారు.

ఖాకీ కన్నేస్తే..:

ఖాకీ కన్నేస్తే..:

బిజినెస్ ఏదైనా సరే, ఖాకీ కన్ను పడిందంటే చేతులు తడపాల్సిందే. అడిగినంతా ఇవ్వకున్నా.. ససేమిరా అన్నా.. వేధింపులు, బెదిరింపులు తప్పవు. ఇదీ నగరంలో కొంతమంది పోలీసుల వసూల్ రాజా వైనం. హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న కొంతమంది కలిసి ఇలా ఓ గ్యాంగ్ లా తయారైనట్టు ప్రచారం జరుగుతోంది.

ఉన్నతాధికారులకూ లింకులు..:

ఉన్నతాధికారులకూ లింకులు..:


ఈ గ్యాంగ్ ఆయా వ్యాపారుల నుంచి డబ్బులు దండుకుంటూ.. ఉన్నతాధికారులకు కూడా ఎంతో కొంత ముట్టజెప్పుతున్నారని తెలుస్తోంది. కాబట్టే.. పై స్థాయి అధికారులు కూడా వీళ్ల లీలలను చూసీ చూడనట్టు వదిలేస్తున్నారట. ఒక్క వసూళ్లకే పరిమితం కాకుండా ఉన్నతాధికారులకు సంబంధించిన పలు అక్రమ వ్యవహారాలను సైతం వీరు చక్కబెడుతున్నారని తెలుస్తోంది.

పేరుకే పోలీసులు.. :

పేరుకే పోలీసులు.. :

ఇటీవల బంజారాహిల్స్‌లోని ఒక స్పా యజమానిని బెదిరించి ముగ్గురు కానిస్టేబుళ్లు అరెస్టవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నగరంలో ఇలాంటి కానిస్టేబుల్స్ గ్యాంగ్స్ చాలానే ఉన్నాయని.. సెటిల్‌మెంట్లు, బెదిరింపుల ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేరుకే పోలీసు వృత్తి కానీ.. ఎంతసేపూ అక్రమ సంపాదన పైనే వారి దృష్టి అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సార్ రమ్మంటున్నారు..:

సార్ రమ్మంటున్నారు..:

నగరంలోని బార్స్, రెస్టారెంట్స్, మసాజ్ సెంటర్లను టార్గెట్ చేయడమే ఈ కానిస్టేబుల్స్ గ్యాంగ్స్ పని. మొదట సున్నితంగానే బేరసారాలు ఆడుతారు. దారికి వస్తే సరేసరి. లేదంటే.. సార్ తీసుకురమ్మంటున్నాడంటూ లాఠీలకు పనిచెబుతారు. అక్రమ కేసులు పెట్టి బయటకు రాకుండా చేస్తామని బెదిరిస్తారు. దీంతో కేసులకు భయపడి చాలామంది వేలకు వేలు సమర్పిస్తున్నారు.

ఉన్నతాధికారులే చేయిస్తున్నారని..:

ఉన్నతాధికారులే చేయిస్తున్నారని..:

చాలా పోలీస్ స్టేషన్లలో ఉన్నతాధికారులే ఇలాంటి 'గ్యాంగ్'లను ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. స్థానిక వ్యాపారుల నుంచి వసూళ్లు దండుకుని సదరు అధికారికి ముట్టజెప్పడం, ఛాయ్ దగ్గరి నుంచి బిర్యానీ వరకు ప్రతీది 'ఫ్రీ'గా వచ్చేలా ఏర్పాట్లు చేయడం వంటి అక్రమాలను వీరు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. గత కొద్ది నెలలుగా ఈ 'గ్యాంగ్'ల ఆగడాలు మరింత ఎక్కువయ్యాయని, మునుపటి కంటే ఎక్కవ వసూళ్లు చేస్తున్నారని తెలుస్తోంది.

English summary
Some of the corrupted police in Hyderabad are collecting money from bars, restaraunts owners, if they questions police warning them in the name of illegal activities
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X