వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీటి శాఖ‌లో అవినీతి జ‌ల‌గ‌లు..! చ‌ర్య‌ల‌కు రంగం సిద్దం చేస్తున్న అదికారులు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎండలు ముదురుతుండటంతో పాటు నగరంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటర్‌బోర్డు సరఫరా చేస్తున్న నీటికి భారీగా డిమాండ్‌ నెలకొంది. గతంలో బిల్లులు చెల్లించని 6 వేలకు పైగా తాగునీటి కనెక్షన్లను వాటర్‌బోర్డు తొలగించింది. వేసవి నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పాత కనెక్షన్లు పునరుద్ధ్దరించుకునే అవకాశాలున్న నేపథ్యంలో విజిలెన్స్‌ అధికారులు 23 డివిజన్లలో ముమ్మర తనిఖీలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో గ్రేటర్‌లో అక్రమ నల్లాల గుర్తింపునకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటునట్లు వాటర్‌బోర్డు అధికారులు తెలిపారు.

<strong>ఉఫ్..ఉఫ్.. సిగ‌రెట్ల‌కు బానిస‌లౌతున్న యువ‌త‌..! జోష్ పేరుతో యాష్ అవుతున్న జీవితాలు..!!</strong>ఉఫ్..ఉఫ్.. సిగ‌రెట్ల‌కు బానిస‌లౌతున్న యువ‌త‌..! జోష్ పేరుతో యాష్ అవుతున్న జీవితాలు..!!

 వేసవి నేపథ్యంలో ముమ్మర తనిఖీలు..!అవినీతి ప‌రుల భ‌ర‌తం ప‌ట్ట‌నున్న అదికారులు..!!

వేసవి నేపథ్యంలో ముమ్మర తనిఖీలు..!అవినీతి ప‌రుల భ‌ర‌తం ప‌ట్ట‌నున్న అదికారులు..!!

వాటర్‌ బోర్డులో ఇంటి దొంగలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. అక్రమ నల్లా కనెక్షన్లపై విజిలెన్స్‌ అధికారులు చేస్తున్న దాడుల్లో భారీగా అక్రమ నల్లాలు బయటపడుతున్నాయి. అక్రమ నల్లాలు వినియోగిస్తున్న భవన యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తున్నప్ప‌టికి., వాటర్‌బోర్డు క్షేత్రస్థాయిలో అక్రమ నల్లాలకు సహకరిస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.

సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధ్దం...! చిట్టా సిద్దం చేస్తున్న వాట‌ర్ బోర్డ్..!!

సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధ్దం...! చిట్టా సిద్దం చేస్తున్న వాట‌ర్ బోర్డ్..!!

గ్రేటర్‌ జోన్‌ పరిధిలో 23 డివిజన్లలో వాటర్‌బోర్డు ఆదాయానికి గండి కొడుతూ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, సిబ్బంది చిట్టాను విజిలెన్స్‌ అధికారులు సిద్ధ్దం చేస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది అండదండలు లేకుండా ఏళ్ల తరబడి అక్రమ నల్లాలు ఎలా వినియోగిస్తున్నారనే కోణంలో అధికారులు దృష్టిసారిస్తున్నారు. అక్రమ నల్లా కనెక్షన్లతో పాటు సహకరించిన సిబ్బంది చిట్టా తయారు చేసి వాటర్‌బోర్డు ఎండీకి సమర్పించేలా విజిలెన్స్ వింగ్‌ ప్రత్యేక నివేదిక సిద్ధం చేస్తోంది.

 అక్రమ నల్లా కనెక్షన్లకు సహకరిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి..! చర్య‌లకు ఉన్న‌తాదికారులు రెడీ..!!

అక్రమ నల్లా కనెక్షన్లకు సహకరిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి..! చర్య‌లకు ఉన్న‌తాదికారులు రెడీ..!!

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లో నీటి ఎద్దడి అధికంగా ఉండటంతో ఆయా ప్రాంతాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. గ్రేటర్‌లో 9.70 లక్షల తాగునీటి నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో సుమారు 2-2.5 లక్షల నల్లాలకు మాత్రమే మీటర్లు పనిచేస్తున్నాయి. మిగతా కనెక్షన్లకు ప్రాంతాల వారీగా సరఫరా ఆధారంగా సగటు బిల్లు వసూలు చేస్తున్నారు. దీంతో కొందరు తక్కువ నీరు వినియోగిస్తున్నా ఎక్కువ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. మరి కొందరు వినియోగించుకున్న దాని కంటే తక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది.

 వాటర్‌ బోర్డు ఎండీకి నివేదిక సమర్పించనున్న విజిలెన్స్‌ వింగ్‌..! అవినీతి ప‌రుల ఆగ‌డ‌లు క‌ట్..!

వాటర్‌ బోర్డు ఎండీకి నివేదిక సమర్పించనున్న విజిలెన్స్‌ వింగ్‌..! అవినీతి ప‌రుల ఆగ‌డ‌లు క‌ట్..!

వేసవిలో నీటి వినియోగం ఎక్కువగా ఉండటంతో ప్రతి నల్లాకు మీటర్లు పెట్టే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వినియోగాన్ని బట్టి చెల్లింపులు అన్న పద్ధతిలో అన్నినల్లాలకు మీటర్లు బిగిస్తే నీటి వృథా తగ్గడంతో బోర్డుకు ఆదాయం పెరిగే అవకాశాలుంటాయని అధికారులు భావిస్తున్నారు. 180కి.మీల దూరం నుంచి గోదావరి, 110 కి.మీ.ల దూరం నుంచి కృష్ణా జలాలను నగరానికి తరలిస్తున్నారు అదికారులు.

English summary
Water boards focused on top officials of the house thieves. Illicit trafficking has been reported in the vigilance officers' attacks on illegal nalla connections. Despite registering criminal cases against building employers who use illegal connections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X