వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రకటించింది. రైతులకు పెట్టుబడి కోసం ,పెట్టుబడి సాయం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు అండగా ఉంటానని ప్రకటించింది. అయితే రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించడమే శాశ్వత పరిష్కారం కాదని తాజాగా ఓ రైతు ఆత్మహత్య తెలియజేసింది.

కన్నెర్ర చేస్తున్న పసుపు, ఎర్రజొన్న రైతులు... లోక్ సభ ఎన్నికలను అడ్డుకునే వ్యూహం కన్నెర్ర చేస్తున్న పసుపు, ఎర్రజొన్న రైతులు... లోక్ సభ ఎన్నికలను అడ్డుకునే వ్యూహం

పెట్టుబడి సాయం ఒక్కటే చాలదు .. రైతులను వేధించే సమస్యలెన్నో

పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం మార్కెట్లో దొరుకుతున్న నకిలీ విత్తనాలపై దృష్టి సారించడం లేదు. ఇక పురుగు మందుల విషయంలోనూ అంతంతమాత్రంగానే పట్టించుకుంటుంది. వీటితోపాటు వాతావరణ పరిస్థితులు రైతుకి అనుకూలించాలి. లేకుంటే రైతుకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. తీరా సాగు చేసిన పంట అమ్ముకుందామని మార్కెట్ కి వెళ్తే అక్కడ గిట్టుబాటు ధర రాక రైతన్నలు కుదేలవుతున్నారు. ఇన్ని సమస్యలు రైతాంగాన్ని పట్టిపీడిస్తున్నాయి.

Cotton farmer committed suicide due to debt ...

అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన నల్లగొండ జిల్లా రైతు

అందుకే నల్లగొండ జిల్లాకు చెందిన ఒక రైతు పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక, అప్పుల బాధ తట్టుకోలేక, ఆత్మాభిమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్క కొండారం లో 40 ఏళ్ల వయసున్న అశోక్ రెడ్డి అనే రైతు 10 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. పత్తి సాగు కోసం అప్పుల సైతం చేశాడు. అయితే పత్తి అంతంతమాత్రంగానే ఉండడంతో, అప్పుల బాధ తీరే మార్గం కనిపించక తెల్లబంగారం సాగు చేస్తున్న రైతన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి తనువు చాలించాడు.

English summary
A farmer from Nalgonda district was unable to cope with debt,and commit suicide with self-esteem.Ashok Reddy, a 40-year-old farmer, has cultivated cotton in 10 acre in Shaligauraram Mandalam Perka Kondaram in Nalgonda district. Cotton has also made debt for cultivation. He committed suicide by drinking pesticide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X