వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చౌకీదారో, టేకీదారో కాదు ఇమామ్‌దార్ కావాలి : ములుగుసభలో కేటీఆర్

|
Google Oneindia TeluguNews

ములుగు : ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు టీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశానికి ఈ ఇద్దరే కావాలా ? మరో సిఫాయి లేరా అని విమర్శించారు. ఇన్నేళ్లు అధికారం చేపట్టిన దేశంలో ఇంకా పేదరికం ఎందుకు ఉందని ప్రశ్నించారు. దీనికి కారణం మోదీ, రాహుల్ కారా అని ఆయన ప్రశ్నించారు. శనివారం ములుగు బహిరంగసభలో ప్రసంగించారు కేటీఆర్.

కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శం

కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శం

సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు కేటీఆర్. సంక్షేమ పథకాలతో మిగతా రాష్ట్రాలకు, దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. ములుగు అభివ‌ృద్ధి కోసం పాటుపడ్డామని, ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయిన జిల్లా ఏర్పాటుచేశామని గుర్తుచేశారు. గోదావరి, చెరువు నీటితో ములుగుకు జలకళ వచ్చిందన్నారు.

మంచిచేస్తారనుకుంటే .. నోట్లో మన్నుకొట్టాడు

మంచిచేస్తారనుకుంటే .. నోట్లో మన్నుకొట్టాడు

గత ఎన్నికల్లో మోదీ హవా నడిచింది. గుజరాత్ సీఎంగా బాగా పనిచేశాడని అధికారం కట్టబెడితే .. ఏం చేయలేదని విమర్శించారు కేటీఆర్. పెద్ద నోట్లు రద్దు చేసి పేదల నోట్లో మన్నుకొట్టారని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో కేసీఆర్ ట్రెండ్ నడుస్తోందని .. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఇందుకు ఉదహరణ అని పేర్కొన్నారు. మనం మరోసారి ఆత్మగౌరవ బావుటా ఎగరేయాలంటే మీ ఆశీర్వాదం కావాలని కోరారు

మరో సిఫాయి లేడా ?

మరో సిఫాయి లేడా ?

దేశానికి కావాల్సింది మోదీ, రాహుల్ కాదన్నారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ నేతలు వింత ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశానికి కావాల్సింది ప్రధానమంత్రి అయితే మోదీ చౌకీదార్‌గా ఉంటానని చెప్తున్నారని సెటైర్లు వేశారు. రాహుల్ ఏమో తన తండ్రి, తాత ప్రధానులుగా పనిచేశారని, తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అంటే మోదీ, రాహుల్ తప్ప మరో నేత వద్ద .. వీళ్లే సిఫాయిలా అని మండిపడ్డారు. దేశానికి కావాల్సింది చౌకీదార్, టేకేదార్ కాదు జోర్ దార్, దమ్ దార్, అసల్ దార్, ఇమామ్ దార్ కేసీఆర్ కావాలని కోరుకుంటుందని పేర్కొన్నారు.

అన్నీ ప్రాంతీయ పార్టీలే ?

అన్నీ ప్రాంతీయ పార్టీలే ?

తమవి జాతీయ పార్టీలని బీజేపీ, కాంగ్రెస్ నేతలు అనడంపై కేటీఆర్ తనదైనశైలిలో స్పందించారు. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలేనని స్పష్టంచేశారు. కొన్ని చిన్న ప్రాంతీయ పార్టీలు కాగా, మరికొన్ని పెద్ద ప్రాంతీయ పార్టీలని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్న 130 సీట్లు ఉన్నాయని .. ఒక్కరాష్ట్రంలో 10 సీట్లు గెలువాలని సవాల్ విసిరారు. ఆరు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ దాటని పార్టీలు .. జాతీయ పార్టీలా అని ప్రశ్నించారు.

English summary
Prime Minister Modi and Congress chief Rahul Gandhi have been filmed at a range of TRS president ktr. Want two of the country? Another not yet criticized ktr. Asked why the poverty was still in the country, which has been in power for some years. The reason for this is Modi and Rahul.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X