• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘ప్రణయ్ ఆత్మ మాతో మాట్లాడుతోంది.. మీతో మాట్లాడిస్తాం’: దంపతులతోపాటు మరో వ్యక్తి అరెస్ట్

|
  ప్రణయ్ ఆత్మ మాతో మాట్లాడుతోంది...!

  నల్గొండ: ఇటీవల మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ ఆత్మ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వన్‌టౌన్‌ సీఐ సదానాగరాజు వెల్లడించారు.

  నా బిడ్డను ప్రణయ్‌కి ప్రతిరూపంగా చూసుకుంటా, వాళ్లని దారుణంగా చంపాలి: అమృత

  ప్రణయ్ ఆత్మ మాట్లాడుతోంది.. మీతో మాట్లాడిస్తాం

  ప్రణయ్ ఆత్మ మాట్లాడుతోంది.. మీతో మాట్లాడిస్తాం

  హైదరాబాద్‌ పటాన్‌చెర్వుకు చెందిన నాగారావు, సత్యప్రియ, నర్సింహ అనే ముగ్గురు వ్యక్తుల ఆదివారం ముత్తిరెడ్డికుంటలో ఉన్న ప్రణయ్‌ నివాసాసికి వెళ్లారు. ప్రణయ్‌ ఆత్మ తమతో మాట్లాడుతుం దని, మీతో కూడా మాట్లాడిస్తామని నమ్మబలి కారు.

  మాయమాటలు చెప్పి..

  మాయమాటలు చెప్పి..

  అనుమానం వచ్చిన ప్రణయ్‌ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించి వారిపై పిర్యాదు చేశారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేయడంతోపాటు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఆత్మ ఉందనే పేరుతో ప్రణయ్‌ కుటుంబ సభ్యులను మోసం చేయడానికి వారు వచ్చారని సీఐ తెలిపారు.

   బెదిరింపులపై ఫిర్యాదు..

  బెదిరింపులపై ఫిర్యాదు..

  కాగా, బెదిరింపుల కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం మిర్యాలగూడ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం. శోభారాణి ఎదుట హాజరుపరిచారు. ప్రణయ్‌ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న తిరునగరు మారుతీరావు, శ్రవణ్, ఖరీంలు కొంతకాలం క్రితం ప్రణయ్, అమృత వివాహ రిసెప్షన్‌ను నిలిపివేయాలని పట్టణానికి చెందిన దినేశ్, అశోక్‌ను బెదిరించారు.

  దీంతో బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  మారుతీరావు సహా నిందితులకు రిమాండ్

  మారుతీరావు సహా నిందితులకు రిమాండ్

  బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను పీటీవారెంట్‌పై కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి అక్టోబర్ 29వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్న ట్టు తెలుసుకున్న మారుతీరావు అనుచరులు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు వచ్చారు. దీంతో భారీ బందోబస్తుతో పోలీసులు నిందితులను నల్గొండ జైలుకు తరలించారు. తనకు ఇష్టం లేకుండా తన కూతురును పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అమృత భర్త ప్రణయ్‌ను మారుతీరావు కిరాయి హంతకులతో హత్య చేయించిన విషయం తెలిసిందే.

  అమృతకు భద్రతగా పోలీసుల నియామకం

  అమృతకు భద్రతగా పోలీసుల నియామకం

  ప్రణయ్‌ పరువు హత్య కేసు దర్యాప్తు తీరుతెన్నులపై నల్గొండ ఎస్పీ రంగనాథ్‌తో వెస్ట్‌జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ కేసులో ఉన్న నిందితుల నేరచరిత్ర వెలుగులోకి తీసుకురావడంతో పాటు పాత నేరాల ఆధారంగా వారిపై పీడీ యాక్ట్‌ మోపాలని నిర్ణయించినట్టు తెలిసింది. మరోవైపు ప్రణయ్‌ భార్య అమృతకు సోషల్‌ మీడియాలో వస్తున్న బెదిరింపులపై స్టీఫెన్‌ రవీంద్ర ఆరా తీశారు. బెదిరింపుల వ్యవహారంపై ఇప్పటికే అమృత పోలీసులకు ఫిర్యాదు చేసిందని, దీంతో ఆమెకు భద్రతగా ఇద్దరు సాయుధ సిబ్బందితో పాటు ఇద్దరు మహిళా పోలీసుల్ని కూడా నియమించినట్లు నల్గొండ పోలీసులు తెలిపారు.

  English summary
  In a bizarre incident, a couple—Naga Rao and his wife Satya Priya—from Hyderabad claimed that the victim of honour killing Pranay’s spirit was talking to them regularly and ready to interact with his wife Amrutha if she comes along with them to their residence in the State capital.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X