• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కోర్టులో షాక్: రెండోసారి రావెల సుశీల్ ఎందుకు వచ్చాడు?

By Pratap
|

హైదరాబాద్: మహిళా టీచర్‌ను చేయి పట్టుకుని లాగిన కేసులో ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడు రావెల సుశీల్‌కు కోర్టులో చుక్కెదురైంది. రెండు రోజుల పాటు ఆయనను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుశీల్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు మంగళవారంనాడు తోసి పుచ్చింది. ఈ నెల 9, 10 తేదీల్లో పోలీసులు సుశీల్‌ను తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.

సుశీల్ (24)ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు సోమవారంనాడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై మంగళవారం వాదనలు జరిగాయి. వ్యవహారంలో మంత్రి కుమారుడు సుశీల్ పాత్ర సుశీల్ పాత్రను, డ్రైవర్ రమేష్ దెబ్బలు తినడానికి కారణాలను లోతుగా దర్యాప్తునకు సిద్ధపడ్డారు.

Court rejects Ravela Susheel's bail petition

టీచర్‌ను తన కారులోకి లాగడానికి యత్నించిన సుశీల్, డ్రైవర్ రమేష్ స్థానికుల చేతుల్లో దెబ్బలు తిన్న తర్వాత రెండోసారి ఘటనా స్థలానికి ఎందుకు వచ్చారనే విషయంపై పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. పది మంది అనుచరులతో వారు ఘటనా స్థలానికి వచ్చినట్లు చెబుతున్నారు. తన మెడలో గొలుసు పోగొట్టుకున్నానని, అందుకే రెండో సారి ఘటనా స్థలానికి వచ్చానని సుశీల్ చెబుతున్నట్లు తెలుస్తోంది.

లేడీ టీచర్ చేయి పట్టుకుని లాగిన కేసులో ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు తనయయుడు రావెల సుశీల్ (24), అతని కారు డ్రైవర్ రమేష్ పోలీసులకు శనివారం అర్థరాత్రి లొంగిపోయారు. శనివారం అర్థరాత్రి వారిద్దరు హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులకు లొంగిపోయారు.

స్టేషన్ బెయిల్ కోసం సుశీల్ తరఫు న్యాయవాదులు ప్రయత్నించారు. అయితే, అది సాధ్యం కాలేదు. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సుశీల్, రమేష్‌లపై పోలీసులు 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

English summary
Court rejected Andhra Pradesh minister Ravela Kishore babu's son Ravela Susheel's bail petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more