హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Covaxin తయారీలో లేగదూడల సీరం వినియోగం: భారత్ బయోటెక్ ఏం చెబుతోంది?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా వైరస్ మహ్మారిని నిర్మూలించడానికి కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్.. ఎట్టకేలకు నోరు విప్పింది. కోవాగ్జిన్ తయారీలో అప్పుడే జన్మించిన లేగదూడల నుంచి వెలికి తీసిన సీరం (రక్తం గడ్డకట్టిన తర్వాత వెలువడే ప్రొటీన్లు)ను వినియోగిస్తోన్నట్లు వచ్చిన వార్తలపై స్పందించింది. వ్యాక్సిన్ తయారీలో లేగదూడలు లేదా ఆవుల నుంచి వెలికి తీసిన సీరంను వాడట్లేదని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ల తయారీలో వాటిని వినియోగించే అవకాశం ఉన్నప్పటికీ- తాము ఆ పని చేయట్లేదని వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్.. కోవాగ్జిన్. దీని తయారీలో అప్పుడే పుట్టిన లేగ దూడల సీరం‌ను వాడుతున్నారంటూ వార్తలు వెల్లువెత్తాయి. అప్పుడే పుట్టిన లేగదూడల రక్తాన్ని గడ్డ కట్టించడం ద్వారా అందులో నుంచి స్రవించే ద్రవాలు, ప్రొటీన్లను కోవాగ్జిన్ తయారీలో వాడుతున్నారని, ఇది చట్టవ్యతిరేకమంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై భారత్ బయోటెక్ యాజమాన్యం స్పందించింది. అలాంటివేవీ తాము వాడట్లేదని స్పష్టం చేసింది.

Covaxin is purified to contain, inactivated virus components by removing impurities: Bharat Biotech

వాటిని వాడటానికి చట్టపరమైన అనుమతులు ఉన్నప్పటికీ- తాము వినూత్న పద్ధతుల్లో కోవాగ్జిన్‌ను వినియోగించినట్లు తేలిపింది. లేగదూడల నుంచి వెలికి తీసిన సీరంను వ్యాక్సిన్ల తయారీ కోసం వినియోగించడం కొత్తేమీ కాదని, అది సంప్రదాయబద్ధంగా వస్తోన్నదేనని భారత్ బయోటెక్ పేర్కొంది. దానివల్ల కణాలు వృద్ధి చెందుతాయని తెలిపింది. తాము దీన్ని ఫైనల్ ఫార్ములేషన్‌లో గానీ, వ్యాక్సిన్ తయారీలోగానీ వాడట్లేదని స్పష్టం చేసింది.

Recommended Video

Ap Capital Moving to vizag on July 23 | Fans Remembering Sushant as he left this world on this day.

కోవాగ్జిన్ వ్యాక్సిన్ స్వచ్ఛమైనదని, క్రియారహిత వైరస్ కాంపొనెంట్స్‌ను తొలగించడానికి అవసరమైన ఫార్ములాలను వినియోగించామని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఫార్మాసూటికల్స్ కంపెనీలు దశాబ్దాల కాలం నుంచి వ్యాక్సిన్ల తయారీ కోసం లేగదూడ లేదా ఆవుల సీరమ్‌ను వినియోగిస్తోన్నాయని, హ్యామ్స్‌స్టర్ ఎఫీషియన్సీ స్టడీ సహా పలు పబ్లికేషన్లు, డాక్యుమెంట్లు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయని భారత్ బయోటెక్ యాజమాన్యం స్పష్టం చేసింది. సీరమ్‌ను వాడే అవకాశం ఉన్నా.. తాము కోవాగ్జిన్‌ను స్వచ్ఛమైనదిగా తయారు చేసినట్లు వెల్లడించింది.

English summary
Bharat Biotech given clarity on that the Covaxin is highly purified to contain only inactivated virus components by removing other impurities. Newborn calf serum is used in manufacturing of viral vaccines. It's used for cells' growth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X