వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ -మంత్రి ఎర్రబెల్లి వార్నింగ్ -కొత్తగా 661 కేసులు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది.. ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ లో.. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం గమనార్హం. దక్షణాదిలో కీలక రాష్ట్రమైన తెలంగాణలోనూ కొత్త కేసులు భారీగా తగ్గడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఈ ఉపశమనం తాత్కాలికమే అని, రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన హెచ్చరిక చేశారు.

కరోనాకు మరో లెజెండ్ బలి -సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు -ప్రమాదమని తెలిసినా సినిమాపై ప్రేమతో షూటింగ్‌ చేసి..కరోనాకు మరో లెజెండ్ బలి -సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు -ప్రమాదమని తెలిసినా సినిమాపై ప్రేమతో షూటింగ్‌ చేసి..

కొత్తగా 661 కేసులు..

కొత్తగా 661 కేసులు..

తెలంగాణ ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 21,264 మందికి కరోనా టెస్టులు చేయగా.. కొత్తగా 661 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,57,374కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,404కి పెరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 48,74,433కి చేరింది. కాగా,

భారీగా రికవరీలు..

భారీగా రికవరీలు..

హెల్త్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 1,637 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు వ్యాధి నుంచి బయటపడినవారి సంఖ్య 2,40,545కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 15,425 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 12,888 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉంటే..

చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్ -క్వారంటైన్‌లో ఉండాల్సిందే -మెగాస్టార్ తొందరపడ్డారా?చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్ -క్వారంటైన్‌లో ఉండాల్సిందే -మెగాస్టార్ తొందరపడ్డారా?

Recommended Video

COVID-19 : Vaccine రాకముందే భారత్ లో ప్రజలు Herd Immunity ని పొందే అవకాశం ఉంది - AIIMS Director
 తెలంగాణలో సెకండ్ వేవ్..

తెలంగాణలో సెకండ్ వేవ్..

చలి కాలం కారణంగా కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. ఆదివారం జనగామా జిల్లాలో పర్యటించిన ఆయన.. టీఆర్ఎస్ కొత్త ఆఫీసు నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా పరిస్థితులపై కీలక కామెంట్లు చేశారు. కరోనా సెకండ్‌వేవ్‌తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కు ధారణ, శానిటైజేషన్ ను ఎట్టిపరిస్థితుల్లో మరవొద్దని చెప్పారు. నిజంగానే తెలంగాణలో కరోనా వేవ్ కొనసాగుతున్నదా? అనేదానిపై వైద్య అధికారులు స్పందించాల్సిఉంది.

English summary
Telangana reported 661 new cases of COVID-19, 3 deaths in las 24 hours according to state health department bulletin on sunday. Minister Errabelli Dayakar Rao warned that corona second wave is booming in Telangana due to the cold season and and warns people to be be careful.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X