వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్ మిస్సింగ్: తెరపైకి సెక్షన్ 8.. అందుకే గవర్నర్ యాక్టివ్.. సంచలనం.. సర్కారు మాటిది..

|
Google Oneindia TeluguNews

చివరిసారిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి(జూన్ 28)నాడు ప్రజలకు కనిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నేటికి పది రోజులు గడుస్తున్నా మళ్లీ పబ్లిక్ అప్పియరెన్స్ ఇవ్వకపోవడం తీవ్రచర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో #whwreiskcr, #KCRMissing లాంటి హ్యాష్ ట్యాగ్స్ దేశవ్యాప్త ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. కరోనా విలయతాండవం చేస్తున్నవేళ.. ప్రజలను గాలికొదిలేసి సీఎం కేసీఆర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, పరిపాలన పూర్తిగా గాడితప్పిన నేపథ్యంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని లేదా విభజన చట్టంలోని సెక్షన్ 8 ను అమలు చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు సంచలన డిమాండ్ తెరపైకి తెచ్చాయి. దీనిపై ప్రభుత్వం సైతం ఇదే స్థాయిలో ప్రతిస్పందించింది.

సీఎం కేసీఆర్ మిస్సింగ్: స్ట్రాటజీ ఇదేనా.. ఫామ్‌హౌజ్‌లో సీఎంవో సెటప్.. వైరస్ తగ్గేదాకా అక్కడే?సీఎం కేసీఆర్ మిస్సింగ్: స్ట్రాటజీ ఇదేనా.. ఫామ్‌హౌజ్‌లో సీఎంవో సెటప్.. వైరస్ తగ్గేదాకా అక్కడే?

సెక్షన్ 8లో ఏముంది?

సెక్షన్ 8లో ఏముంది?


ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2024 వరకు కొనసాగుతుందని ఉన్నా, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ తన పరిపాలనా కేంద్రాన్ని అమరావతికి తరలించడం, ఇక్కడి ఆస్తుల్లో కీలకమైనవాటిని తెలంగాణకు అప్పగించడం తెలిసిందే. అయితే, ఉమ్మడి రాజధానికి సంబంధించి సెక్షన్ 8లో పేర్కొన్న అంశాలపై అప్పట్లో తీవ్రవివాదం నడిచింది. గవర్నర్ కు అసాధారణ అధికారాలు కట్టబెట్టే ఆ సెక్షన్ తరచూ చర్చల్లో నిలిచింది. గడిచిన 10 రోజులుగా ప్రభుత్వాధిపతి కేసీఆర్ అందుబాటులో లేని కారణంగా పరిపాలన గాడితప్పిందని, సెక్షన్ 8 మేరకు గవర్నర్ ముందుకురావాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. అసలు సెక్షన్ 8లో ఏముంది, కరోనా పరిస్థితికి అది యాప్ట్ అవుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలాంటి నేతలు వివరించారు.

ప్రజల ప్రాణాలకు ముప్పు..

ప్రజల ప్రాణాలకు ముప్పు..

విభజన చట్టంలోని సెక్షన్ 8.. ప్రధానంగా శాంతిభద్రతల అంశానికి చెందింది. ఉమ్మడి రాజధాని పరిధిలో కల్లోల పరిస్థితులు తలెత్తినప్పుడు, కేబినెట్ కు సమాచారం ఇచ్చి, పోలీస్ శాఖ, ఇతర ముఖ్యశాఖలకు గవర్నర్ నేరుగా ఆదేశాలు జారీచేయొచ్చనే నిబంధన అందులో ఉంది. అయితే, సెక్షన్ 8 క్లాజ్ 1 ప్రకారం ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లిన సందర్భాల్లోనూ గవర్నర్ పరిపాలనను చేతిలోకి తీసుకునే వీలుందని, కరోనా మహమ్మారి వల్ల ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రజల ప్రాణాలు ముప్పులో ఉండటం, ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్న కారణంగా సెక్షన్ 8 అమలు సబబేనని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య మరో అడుగుముందుకేసి, తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

గవర్నర్ కీలక చర్యలు..

గవర్నర్ కీలక చర్యలు..


సీఎం కేసీఆర్ కు కరోనా సోకినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా, ఆయన ఎక్కడున్నారనేదానిపై ప్రభుత్వంగానీ, అధికార టీఆర్ఎస్ పార్టీగానీ వివరణ ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ తోపాటు బీజేపీ నేతలూ తప్పు పడుతున్నారు. ఈక్రమంలోనే కరోనా సమస్యలపై పలువురు.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వినతులు పంపడంతో ఆమె యాక్టివ్ అయ్యారు. ఆరోగ్య రంగంపై సమీక్షకు రావాల్సిందిగా సీఎస్, హెల్త్ సెక్రటరీని పిలిచినా, పనుల బిజీ కారణంగా రాలేకపోతున్నామని వారు బదులు చెప్పడడం కూడా వివాదాస్పదమైంది. తద్వారా రాజ్ భవన్ ను కేసీఆర్ సర్కారు లెక్కచేయడం లేదనే సంకేతం పంపుతున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. చివరికి ఒక రోజు ఆలస్యంగా మంగళవారం రాత్రి సీఎస్ సోమేశ్ కుమార్, హెల్త్ సెక్రటరీ శాంతికుమారిలు గవర్నర్ ను కలిసి వివరాలు అందజేశారు. మరోవైపు ప్రైవేలు ఆస్పత్రుల యాజమాన్యాలతోనూ తమిళిసై కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం ప్రజలకు అందుబాటులో లేనందుకే గవర్నర్ యాక్టివ్ అయి ప్రజలకు భరోసా కల్పిస్తున్నారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.

స్వప్న సురేష్.. సెన్సేషనల్ క్రైమ్.. సీఎం మెడకు స్మగ్లింగ్ వ్యవహారం.. టాప్ ఐఏఎస్ ఔట్.. పెనుదుమారంస్వప్న సురేష్.. సెన్సేషనల్ క్రైమ్.. సీఎం మెడకు స్మగ్లింగ్ వ్యవహారం.. టాప్ ఐఏఎస్ ఔట్.. పెనుదుమారం

సచివాలయం కూల్చివేతకు లింకు..

సచివాలయం కూల్చివేతకు లింకు..

రాష్ట్రంలో పరిపాలన ప్రజల ప్రాధాన్యతకు అనుగుణంగా జరగడం లేదని, జనమంతా కరోనా భయంతో విలవిలలాడుతోంటే ప్రభుత్వం మాత్రం సచివాలయం కూల్చివేతకు ప్రాధాన్యం ఇవ్వడమేంటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘‘ఇవాళ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేవు. ప్రైవుటు వాళ్లు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలకు కూడా బాండ్లు అమ్ముకునే పరిస్థితి. ఇలాంటి సమయంలో రూ.500 కోట్లతో కొత్త సచివాలయం నిర్మాణాన్ని ఇంత అర్జెంటుగా ప్రారంభించాల్సిన అవసరమేంటి? అదే డబ్బును ప్రజల ఆరోగ్యం కోసం వాడొచ్చుకదా. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టే గవర్నర్ ఇంకా యాక్టివ్ కావాలని మేం కోరుతున్నాం''అని రేవంత్ రెడ్డి అన్నారు.

సెక్షన్ 8 అంటే నాలుక కోస్తారు..

సెక్షన్ 8 అంటే నాలుక కోస్తారు..

కరోనా వైరస్ వ్యాప్తి, సచివాలయం కూల్చివేతను సాకుగా చూపుతూ తెలంగాణలో రాష్ట్రపతి పాలన, హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుండటంపై టీఆర్ఎస్ సర్కారు ఎట్టకేలకు స్పందించింది. మంగళవారం వివిధ ప్రాంతాల్లో మీడియాతో మాట్లాడుతూ మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రతిపక్ష నేతలపై నిప్పులు చెరిగారు. మరో మంత్రి హరీశ్ రావు ట్విటర్ లో స్పందించారు. ‘‘తెలంగాణ నేతలై ఉండి, ఆంధ్రావాళ్లలాగా మీరు కూడా సెక్షన్ 8 అంటారా?, సెక్షన్ 8 అంటే నాలుక కోస్తారు. హైదరాబాద్ తెలంగాణ సొత్తు.. ఇతరుల పెత్తనాన్ని ఒప్పుకోం. కేసీఆర్ ఎక్కడుంటే ఏంటి? పథకాలు ఆగాయా?'' అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైరయ్యారు.

Recommended Video

Telangana New Secretariat పై పెద్ద ఎత్తున విమర్శలు, ప్రజాధనం వృథా | MLA Jagga Reddy ఆవేదన...!!
ఇంకా ఆంధ్రాకు బానిసలేనా..

ఇంకా ఆంధ్రాకు బానిసలేనా..

కేసీఆర్ జాడపై వెల్లువెత్తిన ప్రశ్నలకు మౌనం వహించిన మంత్రులు, టీఆర్ఎస్ నేతలు.. సెక్షన్ 8, రాష్ట్రపతి పాలన అంశాలపై మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు గతంో ఆంధ్రప్రదేశ్ నేతలకు బానిసలుగా పనిచేసిన తీరు ఇంకా మార్చుకోలేదంటూ గులాబీ నేతలు ఫైరయ్యారు. ఈ క్రమంలో మంత్రి హరీశ్ రావు.. ‘‘ఆంధ్రప్రదేశ్ సీఎంల దగ్గర పనిచేసిన మీరు ఇంకా అదే మనస్తత్వం తో కొనసాగుతున్నట్లు కనబడుతున్నది''అని చురక వేశారు. మరో మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందిస్తూ.. సెక్షన్-8 మీద ప్రతిపక్ష నాయకులకు ఏమాత్రం అవగాహన లేదని, తెలంగాణ ఏర్పాటు వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం అయినందున, ఆ నాయకులు ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు.

English summary
amid covid-19 cases raising in telangana and cm kcr not came in to public appearance for 10 days, the opposition parties including congress and bjp demands for president rule and imposition of section 8 of ap reorganisation act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X