వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో కరోనా: 1771 కొత్త కేసులు, 13 మరణాలు -ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పెరిగిన వ్యాప్తి

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదిగా అదుపులోకి వస్తున్నది. అయితే, ఇన్నాళ్లూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా కొత్త కేసులు రాగా, ఇప్పుడది జిల్లాల్లో చోటుచేసుకుంటుండటం కలవరపెడుతున్నది. రికవరీలు భారీగా ఉండటంతో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి.

 Hajj 2021: విదేశీయులకు నో ఛాన్స్ -covid టీకాలు పొందిన 60వేల మంది స్థానికులకే: సౌదీ అరేబియా Hajj 2021: విదేశీయులకు నో ఛాన్స్ -covid టీకాలు పొందిన 60వేల మంది స్థానికులకే: సౌదీ అరేబియా

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం వెలువరించిన బులిటెన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,525 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 1,771 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,02, 089కి పెరిగింది.

covid-19 in Telangana: 1,771 new cases, 13 deaths in last 24 hrs, active cases down to 22k

జీహెచ్ఎంసీ పరిధిలో 171 కొత్త కేసులు నమోదుకాగా, నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో హైదరాబాద్ స్థాయిలో కొత్త కేసులు వచ్చాయి. నల్గొండ జిల్లాలో 157, ఖమ్మం జిల్లాలో 149, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 107, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 104 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 2 కేసులు గుర్తించారు.

chandrababuతో sonu sood -రియల్ హీరో కితాబు -ఇదేందయ్యా.. నేనెప్పుడూ చూడలే!chandrababuతో sonu sood -రియల్ హీరో కితాబు -ఇదేందయ్యా.. నేనెప్పుడూ చూడలే!

నిన్న ఒక్కరోజే కొవిడ్ కారణంగా 13 మంది చనిపోయారు. దీంతొ మొత్తం మరణాల సంఖ్య 3,469కి పెరిగింది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.3శాతంకాగా, తెలంగాణలో అది 0.57శాతంగా ఉంది. తాజాగా 2,384 మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో రికవరీల సంఖ్య 5,76,487కు పెరిగింది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 95శాతంకాగా, తెలంగానలో అది 95.74శాతంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 22,133కు పడిపోయాయి.

English summary
Telangana has reported 1,771 new Covid infections and 13 fatalities on Saturday pushing the cumulative number of deaths to 3,469 and the total number of positive cases to 6,02,089. The number of active cases in Telangana, as on Saturday evening stood at 22,133. Between Friday and Saturday, authorities conducted 1,20,525 Covid tests of which results of 1,380 samples were awaited. On Saturday, 2,384 individuals have recovered with a recovery rate of 95.74 per cent. So far, a total of 1,66,32,289 Covid-19 tests have been conducted in the State out of which 6,02,089 have tested positive and 5,76,487 persons have recovered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X