వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో కరోనా: 99శాతం రికవరీలు -కొత్తగా 146 కేసులు, రెండు మరణాలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ వ్యాప్తంగా కరోరా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. జాతీయ సగటు కంటే మెరుగైన రికవరీ రేటు కొనసాగుతోంది. కీలకంగా భావిస్తోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై వారియర్లు విముఖత ప్రదర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

భారత్‌లో కరోనా: 97% మించి రికవరీలు -కొత్తగా 12,194 కేసులు, 92 మరణాలుభారత్‌లో కరోనా: 97% మించి రికవరీలు -కొత్తగా 12,194 కేసులు, 92 మరణాలు

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెలువరించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో గడిడిచిన 24 గంటల్లో కొత్తగా 146 పాజిటివ్ కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. తద్వారా మొత్తం కేసుల సంఖ్య 2,96,574కు, మరణాల సంఖ్య 1,616కు పెరిగాయి. అయితే..

covid-19 in TS: 146 new cases, 2 deaths in last 24 hrs

నిన్న ఒక్కరోజే 177 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. మొత్తంగా 2,93,210 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దేశంలో కరోనా రికవరీ రేటు 97.3శాతంకాగా, తెలంగాణలో మాత్రం అత్యంత మెరుగ్గా రికవరీ రేటు 98.86గా కొనసాగుతోందని రాష్ట్ర వైద్య శాఖ పేర్కొంది.

తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,748కి పడిపోపాయి. అందులో వారిలో 749 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారని బులిటెన్ లో పేర్కొన్నారు. ఇక కొత్తగా నమోదైనవాటిలో జీహెచ్ఎంసీలోనే 29 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు వచ్చాయి. ఈ రెండూ తప్ప మిగతా అన్నిజిల్లాల్లో కొత్త కేసులు సింగిల్ డిజిట్ లేదా నిల్ కు పరిమితం అయ్యాయి. కాగా,

Pulwama Terror Attack: రెండేళ్లు -NIA విఫలం -Interpol ఎంట్రీ -అమర జవాన్లకు కిసాన్ల నివాళిPulwama Terror Attack: రెండేళ్లు -NIA విఫలం -Interpol ఎంట్రీ -అమర జవాన్లకు కిసాన్ల నివాళి

తెలంగాణలో తొలి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ శుక్రవారంతో ముగియగా.. టీకాల పట్ల కరోనా వారియర్లు విముఖత ప్రదర్శించినట్లు లెక్కల్లో వెల్లడైంది. చివరి రోజు వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకున్న వారిలో 24 శాతం మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2,77,825 మంది వ్యాక్సిన్ ఇవ్వగా.. రిజిస్టర్ చేసుకున్న వారిలో ఇది 33 శాతం మాత్రమే కావడం గమనార్హం.

English summary
As many as 146 fresh coronavirus positive cases and two deaths were recorded in the last 24 hours in the state. With the fresh cases, the total coronavirus cases tally touched 2,96,574 while the fatality count went up to 1,616. And the total number of recovery cases in the state reached 2,93,210 with the recovery of 177 persons in a single day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X