వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో కరోనా: తగ్గిన మరణాలు -కొత్తగా 197 కేసులు -రేపట్నుంచి ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకాలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి చాలా వరకు తగ్గింది. మరణాలు, కొత్త కేసులు అదుపులోకి వచ్చాయి. అదే సమయంలో రికవరీలు పెరిగి, యాక్టివ్ కేసులు తగ్గాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుండగా... సోమవారం నుంచి ప్రైవేటు మెడికల్ సిబ్బందికి కూడా టీకాలు అందించనున్నారు..

రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 197 కేసులు, ఒక మరణం నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,93,253కు, మరణాల సంఖ్య 1,589కి చేరింది. ఇక. దేశంలో మరణాల రేటు 1.4శాతంగా ఉండగా, తెలంగాణలో మాత్రం అది 0.54శాతంగా ఉంది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 32 కేసులు వెలుగుచూశాయి. ఇక..

కరోనా: భారత్ రికార్డు -వారంలో 16లక్షల మందికి టీకాలు -కొత్తగా 14,849 కేసులు, భారీగా తగ్గిన మరణాలుకరోనా: భారత్ రికార్డు -వారంలో 16లక్షల మందికి టీకాలు -కొత్తగా 14,849 కేసులు, భారీగా తగ్గిన మరణాలు

 covid-19 in ts: 197 new cases, one death, private medical workers to get vaccine from monday

కొవిడ్ వ్యాధి నుంచి కొత్తగా 376 మంది కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 2,88,275కి చేరింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.8శాతంగా ఉండగా, తెలంగాణలో మాత్రం అది 98.30గా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,389 ఉండగా వీరిలో 1842 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు..

Shrishti Goswami అనే నేను సీఎంగా -ఒక్కరోజు ముఖ్యమంత్రిగా రికార్డు -అసెంబ్లీ సమావేశాలు కూడాShrishti Goswami అనే నేను సీఎంగా -ఒక్కరోజు ముఖ్యమంత్రిగా రికార్డు -అసెంబ్లీ సమావేశాలు కూడా

తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. సోమవారం నుంచి ప్రవేట్ హెల్త్ వర్కర్లకు కూడా కరోనా వ్యాక్లిన్లు అందజేయనున్నారు. మొత్తం 173 కేంద్రాలలో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేశారు. మొత్తం ఒక లక్షా 50 వేల మంది ప్రవేట్ హెల్త్ వర్కర్లకు టీకా వేయనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తుంది. ప్రవేట్ హెల్త్ వర్కర్స్ హైదరాబాద్‌‌లోనే అత్యధికంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

English summary
Telangana reported 197 new COVID cases taking the overall tally to 2,93,253 in the state according to health department bulletin on sunday. One new death was reported on January 23, taking the total tally to 1,589. The fatality rate in the state is 0.54 percent which is less than the national average of 1.4 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X