వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్ మిస్సింగ్: స్ట్రాటజీ ఇదేనా.. ఫామ్‌హౌజ్‌లో సీఎంవో సెటప్.. వైరస్ తగ్గేదాకా అక్కడే?

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. కొత్తగా మరో 1879 మందికి వైరస్ సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 28వేలకు చేరువైంది. రికవరీ రేటు గణనీయంగా ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి వేగం, పాజిటివిటీ రేటు భయానకంగా ఉండటం అందరినీ కలవరపెడుతోంది. కరోనాకు సంబంధించి తొలినుంచీ అన్నీ తానై నడిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు పది రోజులుగా ప్రజల ముందుకు రాకపోవడంతో ఒకింత గందరగోళానికి దారితీసింది.

Recommended Video

#WhereisKcr : KCR Missing..వైరస్ తగ్గేదాకా అక్కడే ! || Oneindia Telugu

కరోనా: కేసీఆర్ సర్కారుకు వారం గడువు.. గవర్నర్ వద్దకు సీఎస్, హెల్త్ సెక్రటరీ..కరోనా: కేసీఆర్ సర్కారుకు వారం గడువు.. గవర్నర్ వద్దకు సీఎస్, హెల్త్ సెక్రటరీ..

ఇంకా ట్రెండింగే..

ఇంకా ట్రెండింగే..


ప్రగతి భవన్ లో సిబ్బందితోపాటు కేసీఆర్ కు కూడా కరోనా సోకిందన్న ప్రచారం ప్రజలను మరింత కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. దీనిపై ప్రభుత్వంగానీ, అధికార టీఆర్ఎస్ పార్టీగానీ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో #whwreiskcr, #KCRMissing లాంటి హ్యాష్ ట్యాగ్స్ ఇంకా ట్రెడింగ్ లో కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నేతలు ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ అనూహ్య డిమాండ్లను తెరపైకి తెచ్చారు. ఈలోపే..

ఇకపై అక్కడి నుంచే?

ఇకపై అక్కడి నుంచే?


కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోన్న తరుణంలో.. ఆయన ఇప్పుడప్పుడే హైదరాబాద్ రాలేరని, సుదీర్ఘకాలంపాటు ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ నుంచే పరిపాలన కొనసాగించబోతున్నారని, అందుకే #whwreiskcr, #KCRMissing లాంటి ప్రశ్నలకు సర్కారుగానీ, అధికార పార్టీగానీ ఉద్దేశపూర్వకంగానే సమాధానం చెప్పడంలేదని పలు రిపోర్టుల్లో వెల్లడైంది. బహుశా కరోనా ప్రభావం తగ్గేదాకా కేసీఆర్ ఫామ్ హౌజ్ కే పరిమితమైపోతారనే వాదన కూడా వినిపిస్తోంది.

ఫామ్‌హౌజ్‌లో సీఎంవో సెటప్..

ఫామ్‌హౌజ్‌లో సీఎంవో సెటప్..

కరోనా విజృంభణ నేపథ్యంలో హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ విధింపుపై చర్చించేందుకు ఈనెల మొదటి వారంలోనే కేబినెట్ భేటీ కావాల్సిఉన్నా సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ కు వెళ్లిపోవడంతో అది వాయిదాపడింది. చివరిసారిగా ఆయన పీవీ జయంతి(జూన్ 28న) బహిరంగ సభలో పాల్గొన్నారు. కాగా, పాలనా పరమైన మార్పుల్లో భాగంగా గజ్వేల్ ఎర్రవల్లిలోని సీఎం ఫామ్ హౌజ్ లో కూడా ప్రగతి భవన్ మాదిరిగా సీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడేందుకు స్క్రీన్లు, ఇతర సరంజామా సిద్ధం చేశారని, సాధారణ పరిపాలన విభాగం అధికారుల సూచన మేరకు సీఎం ట్రయల్ రన్ కూడా నిర్వహించి, కొందరు అధికారులు, కొన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడినట్లుగా కూడా తెలుస్తోంది.

కేసీఆర్ కు కరోనా.. విజయశాంతి సంచలనం.. రోజులు దగ్గరపడ్డాయని ఫైర్.. గవర్నర్ కీలక చర్యలు..కేసీఆర్ కు కరోనా.. విజయశాంతి సంచలనం.. రోజులు దగ్గరపడ్డాయని ఫైర్.. గవర్నర్ కీలక చర్యలు..

నో ఎంట్రీపై మౌఖిక ఆదేశాలు?

నో ఎంట్రీపై మౌఖిక ఆదేశాలు?

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాబోయే కాలంలో ప్రతివారం 5రోజులు ఫామ్ హౌజ్ నుంచి 2రోజులు ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ పనిచేస్తారని ఓ ప్రముఖ పత్రిక పేర్కొంది. అలాగే, జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫామ్ హౌజ్ పరిసరాల్లో నిత్యం హైపో క్లోరినేషన్ పిచికారి, ఇతరులెవరినీ లోనికి అనుమతించకపోవడం లాంటివి చేపట్టారని, అత్యవసరం అయితే తప్ప, అది కూడా ఫోన్ లోనే మాట్లాడటమే తప్ప మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలెవరూ ఫామ్ హౌజ్ కు రావొద్దని మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోందని ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ వార్తలను ప్రభుత్వ, టీఆర్ఎస్ వర్గాలు ఖండించకపోవడం గమనార్హం.

English summary
As #whereiskcr still trending, report says that telangana cm kcr likely to stay at farm house for a long time, the cmo setup has been prepared there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X