• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణలో ఘోరం: ఒక్కరోజే 15 మంది బలి -తొలిసారి 5,093 కొత్త కేసులు -కేంద్రం షాక్ -వ్యాక్సినేషన్ బంద్

|

తెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా కొనసాగుతున్నది. మ్యూటేషన్లు, డబుల్ మ్యూటేషన్ల రూపంలో వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని, గాలి ద్వారానూ కరోనా సోకే అవకాశాలున్నందున ఇంట్లో ఉన్నప్పుడూ మాస్కులు ధరించాలని వైద్య శాఖ హెచ్చరించిన మరుసటిరోజే కొవిడ్ పుట్ట బద్ధలైందా అనేంత స్థాయిలో కొత్త కేసులు, మరణాలు వెలుగులోకి వచ్చాయి. కొరత కారణంగా ఆదివారం వ్యాక్సినేషన్ ప్రక్రియ రద్దయింది..

జగన్‌పై అమిత్ షా యాక్షన్ -విదేశీ పర్యటనలు రద్దు -పవన్ చెప్పింది చేస్తా -తిరుపతిలో రీపోల్: ఎంపీ రఘురామజగన్‌పై అమిత్ షా యాక్షన్ -విదేశీ పర్యటనలు రద్దు -పవన్ చెప్పింది చేస్తా -తిరుపతిలో రీపోల్: ఎంపీ రఘురామ

అత్యధిక కొత్త కేసుల రికార్డు..

అత్యధిక కొత్త కేసుల రికార్డు..

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక రోజువారీ కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి 8గంటల వరకు 1,29,637శాంపిళ్లను పరీక్షించగా, భారీ స్థాయిలో కొత్తగా 5,093 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. కొత్తవాటితో కలిపి తెలంగాణలో మొత్తం కసుల సంఖ్య 3,51,424కు పెరిగింది.

మరణ మృదంగం..

మరణ మృదంగం..

కొత్త కేసుల్లో రికార్డు నమోదుకావడంతోపాటు రాష్ట్రంలో కొవిడ్ మరణాలూ అంతకంతకూ భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ బారినపడి చనిపోయినవారి సంఖ్య 1,824కు చేరింది. జాతీయ స్థాయిలో మరణాల రేటు 1.2శాతంగా కాగా, తెలంగాణలో అది 0.51 శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు.

రికవరీ రేటు అమాంతం డౌన్..

రికవరీ రేటు అమాంతం డౌన్..

కొత్త కేసులు, మరణాలు భారీగా పెరగడంతో తెలంగాణ రికవరీ రేటు గణనీయంగా పడిపోయింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్కరోజే 1,555 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,12,563కి చేరింది. ఒకప్పుడు 99శాతానికి దగ్గరగా ఉన్న రికవరీ రేటు కాస్తా ఇప్పుడు 88.94 శాతానికి దిగింది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 86.6శాతంగా ఉంది. ఇక,

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి భారీ షాక్ -ఎస్టీ హోదాపై హైకోర్టు నోటీసులు -రాజీనామా చేయాలంటూడిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి భారీ షాక్ -ఎస్టీ హోదాపై హైకోర్టు నోటీసులు -రాజీనామా చేయాలంటూ

గ్రేటర్ సహా 5జిల్లాలో బాగా

గ్రేటర్ సహా 5జిల్లాలో బాగా

తెలంగాణలో ప్రస్తుతం 37,037 యాక్టివ్‌ కేసులు ఉండగా, వారిలో 24,156 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా వెలుగులోకి వచ్చిన కేసుల్లో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలో 743 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అధికంగా, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 488, రంగారెడ్డి జిల్లాలో 407, సంగారెడ్డి 232, కామారెడ్డి 232, జగిత్యాల జిల్లాలో 223 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే..

  YS Sharmila Arrest షర్మిల దీక్ష భగ్నం.. పాదయాత్ర చేస్తుండగా స్పృహతప్పి YS Jagan రంగంలోకి దిగుతారా ?
  ఆదివారం వ్యాక్సినేషన్ రద్దు

  ఆదివారం వ్యాక్సినేషన్ రద్దు

  కొత్త కేసుల ఉధృతి పెరగడానికి ముందు నుంచే దేశంలో ఆదివారం నాడు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింపు మొదలైంది. అయితే, ఇప్పుడు కేసులు, మరణాలు పెరగడం, టీకా మహోత్సవం చేద్దామంటూ ప్రధాని నరేంద్ర మోదీ హడావుడి ప్రకటన చేసిన తర్వాత దాదాపు అన్ని రాష్ట్రాల్లో టీకాలు నిండుకున్నాయి. ముడి సరుకు కొరత కారణంగా దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రతికూల ప్రభావానికి లోనైంది. కేంద్రం నుంచి తగినన్ని డోసులు రాని కారణంగా తెలంగాణలో టీకాల కొరత ఏర్పడింది. దీంతో ఆదివారం వ్యాక్సినేషన్‌ను నిలిపివేస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

  English summary
  Telangana recorded its largest surge of Covid cases and fatalities since the pandemic started last year with authorities reporting 5,093 new cases and 15 fatalities on Saturday, according to bulletin released by state health department on sunday. The overall tally has touched 3,51,424, total number of deaths to 1824.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X