వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో కరోనా: మళ్లీ పెరిగిన కేసులు -కొత్తగా 163 మందికి వైరస్, ఒకరి మృతి -రికవరీ రికార్డు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కొంత కాలంగా నిలకడగా ఉన్న కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే, రికవరీల్లో మాత్రం జాతీయ సగటు కంటే మిన్నగా రికార్డు సాధించింది. గ్రేటర్ సహా చుట్టుపక్కల జిల్లాల్లో వైరస్ ప్రభావం కొనసాగుతోంది..

రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,598 కి చేరింది. కరోనా బారిన పడి నిన్న ఒక్కరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. తద్వారా మరణాల సంఖ్య 1,624కు పెరిగింది. కరోనా మరణాల్లో జాతీయ సగటు 1.4శాతంకాగా, తెలంగాణలో మాత్రం అది 0.54శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. ఇక.

అసదుద్దీన్ అనూహ్యం: యూపీలో సమాజ్ వాదీ ఫ్యామిలీతో పొత్తు! -బెంగాల్‌లో ఐఎస్ఎఫ్‌తో -25న ఓవైసీ ర్యాలీఅసదుద్దీన్ అనూహ్యం: యూపీలో సమాజ్ వాదీ ఫ్యామిలీతో పొత్తు! -బెంగాల్‌లో ఐఎస్ఎఫ్‌తో -25న ఓవైసీ ర్యాలీ

covid-19: Telangana records 163 new cases, one death in last 24 hours

కొవిడ్ వ్యాధి నుంచి నిన్న ఒక్కరోజే 146 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తంగా 2,94,243 మంది మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. జాతీయ స్థాయిలో కొవిడ్ రికవరీ రేటు 97.2శాతం కాగా, తెలంగాణలో మాత్రం రికవరీ రేటు 98.87 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,731 యాక్టివ్ కేసులున్నాయి.

భారత్‌ గ్లోబల్ లీడర్‌: యూఎన్ చీఫ్ కితాబు -కరోనాపై పోరు, వ్యాక్సిన్ తయారీపై ప్రశంసలుభారత్‌ గ్లోబల్ లీడర్‌: యూఎన్ చీఫ్ కితాబు -కరోనాపై పోరు, వ్యాక్సిన్ తయారీపై ప్రశంసలు

కొత్తగా వెలుగుచూసిన కొవిడ్ కేసుల్లో హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో నిన్న ఒక్కరోజే కొత్తగా 29 కేసులు రాగా, రంగారెడ్డి జిల్లాలో 12, మల్కాజ్ గిరి జిల్లాలో 11 కొత్త కేసులు వచ్చాయి. శనివారం ఒక్కరోజే 23,607 టెస్టులు చేపట్టగా, ఇప్పటివరకు జరిపిన మొత్తం టెస్టుల సంఖ్య 84,56,940కి పెరిగినట్లు బులిటెన్ లో పేర్కొన్నారు.

English summary
Telangana has logged 163 new Covid cases and one death in the last 24 hours, taking the cumulative tally to 2,97,508 and toll to 1,624, health officials said on Sunday. The fatality rate remained 0.54 per cent against the national average of 1.4 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X