వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో కరోనా: తగ్గిన మరణాలు -కొత్తగా 276 కేసులు -16న గాంధీలో తొలి టీకా డోసు

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దాదాపు కంట్రోల్ లోకి వచ్చింది. టెస్టుల సంఖ్య యధావిధిగా కొనసాగుతున్నా, కొత్తగా వెలుగులోకి వస్తోన్న కేసుల సంఖ్య తగ్గుతోంది. మరణాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. డిశ్చార్జీలు పెరగడంతో యాక్టివ్ కేసులు తగ్గాయి. ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం సర్కారు యంత్రాంతం సర్వం సిద్ధం చేసింది.

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,894 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 276 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,90,916కి చేరింది.

షాకింగ్: పిల్లి కళేబరాన్ని తొవ్వి తీసి -కూరలా వండుకుని తిన్న సెలబ్రిటీ -పెను దుమారంషాకింగ్: పిల్లి కళేబరాన్ని తొవ్వి తీసి -కూరలా వండుకుని తిన్న సెలబ్రిటీ -పెను దుమారం

గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి వల్ల కేవలం ఒకరు మాత్రమే మృతి చెందారు. దీంతో ఇప్పటిదాకా చనిపోయినవారి సంఖ్య 1,572కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 238 మంది కోలుకున్నారు. తద్వారా ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,84,849కి చేరింది. ఇక..

covid-19: Telangana sees 276 new cases, one death in last 24 hrs

రాష్ట్రంలో ప్రస్తుతం 4,495 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని బులిటెన్ లో పేర్కొన్నారు. వారిలో 2,487 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 53 కేసులు వచ్చాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 73,79,538కి చేరింది. ఈనెల 16న..

ఏపీ అభివృద్ధి కోసమే అప్పులు -చంద్రబాబు శాపనార్థాలే జగన్‌కు దీవెనలు :మంత్రి బొత్సఏపీ అభివృద్ధి కోసమే అప్పులు -చంద్రబాబు శాపనార్థాలే జగన్‌కు దీవెనలు :మంత్రి బొత్స

తెలంగాణలో మొదటి కరోనా టీకాను పారిశుధ్య కార్మికులకు ఇవ్వనున్నారు. ఈ ప్రభుత్వం సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండగా, సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వ్యాక్సినేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 139 సెంటర్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు ఒక్కో సెంటర్‌లో 30 మంది చొప్పున ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మరుసటి 50 మందికి, ఆ తరువాతి రోజు 100 మందికి ఇలా అంచెల వారీగా వ్యాక్సిన్ డోసుల సంఖ్య పెంచనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

English summary
Telangana recorded 276 COVID-19 cases on Tuesday, taking the total to 2,90,916. While only one death reported in last 24 hours. total toll is now 1,572 according to state health department
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X