వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా ప్రాణం కాపాడిన దేవుడు మంత్రి ఈటల.. నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్..

|
Google Oneindia TeluguNews

టాలీవుడ్ లో కరోనా బారిన పడ్డ తొలి ప్రముఖుడు నిర్మాత బండ్ల గణేష్. హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లి, అనుకోకుండా వైరస్ కాటుకు గురైన ఆయన.. అపోలో చికిత్స అనంతరం గత వారమే వ్యాధి నుంచి కోలుకున్నారు. తన క్షేమ సమాచారాన్ని అభిమానులకు చెబుతూ, ట్విటర్ లో నెగటివ్ రిపోర్టులను సైతం షేర్ చేశారాయన. కాగా, వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత గణేష్ తనవంతుగా.. కొవిడ్-19కు సంబంధించిన పాజిటివ్ సమాచారాన్ని అందరికీ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఆసక్తికర చర్యకు పూనుకున్నారు.

కేసీఆర్ కు కరోనా పాజిటివ్.. అసలు కథ.. భయానక పాజిటివ్ రేటు.. రంగంలోకి కేంద్రం?కేసీఆర్ కు కరోనా పాజిటివ్.. అసలు కథ.. భయానక పాజిటివ్ రేటు.. రంగంలోకి కేంద్రం?

''ఆ రాత్రి మాకు ఫోన్ చేసి మాట్లాడి నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. 24 గంటలు పనిచేస్తున్న ఆరోగ్య మంత్రి గారికి ధన్యవాదాలు. నా ప్రాణం కాపాడిన దేవుడు ఈటల రాజేందర్ గారు.. ''అంటూ తెలంగాణ సీఎంవో, హెల్త్ మినిస్టర్ ను ట్యాగ్ చేస్తూ గణేష్ ఓ ట్వీట్ చేశారు. అలాగే, మరో కొవిడ్ బాధితుడి స్టేట్మెంట్ ను కూడా నిర్మాత షేర్ చేశారు. ''నా పేరు ఎండీ రఫీ నాకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో కొన్ని హాస్పిటల్ కి వెళ్ళాను.. వాళ్లు చేర్చుకోమని చెప్పడంతో ఇంటర్నెట్ లో మంత్రి ఈటల రాజేందర్ నంబర్ చూసి ఫోన్ చేశాను. రాత్రి 12 గంటల సమయంలోనూ సార్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి, వాళ్ళ పీఏను పురమాయించారు'' అని అందులో రాసుంది.

 covid-19: tollywood actor, producer bandla ganesh praises TS health minister Etela rajender

రెండు ట్వీట్లూ రఫీకి చెందినవే అయినప్పటికీ, వాటిని వేర్వేరుగా పోస్ట్ చేయడంతో నిర్మాత గణేషే మంత్రి ఈటలకు ధన్యవాదాలు చెప్పినట్లుగా సంకేతం వెళ్లింది. తెలంగాణలో కొవిడ్-19 కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయన్న గణేష్.. అటు ఏపీ సర్కారు పని తీరుపైనా ప్రశంసలు కురిపించారు.

English summary
after recovered from covid-19, tollywood actor, producer bandla ganesh thanked and praised telangana health minister Etela rajender. in his social media accounts the producers keep on posting positive news related to covid-19
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X