వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొవిడ్-19: గవర్నర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఫైర్ -బీజేపీ అధ్యక్షురాలిగా మాట్లాడారన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

|
Google Oneindia TeluguNews

కరోనా కట్టడి చర్యల్లో కేసీఆర్ సర్కారు దారుణంగా ఫెయిలైందంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలు చేయడంపై అధికార టీఆర్ఎస్ పార్టీ భగ్గున మండింది. ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి.. గవర్నర్ ను ఉద్దేశించి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడుతూ గవర్నర్ కీలక అంశాలను ప్రస్తావించారు.

కరోనా ఉధృతిని ప్రభుత్వం సరిగా అచనా వేయలేకపోయిందని, టెస్టుల సంఖ్య పెంచడమే వైరస్ వ్యాప్తి నియంత్రణకు మార్గమని సూచించినా అధినేతలు పట్టించుకోలేదని, మొబైల్ టెస్టింగ్‌లు ఏర్పాటు చేయాలన్న తన సూచిన కూడా పట్టించుకోలేదని, కరోనాకు సంబంధించి ఐదారుసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని, సీఎం కేసీఆర్ కలిసిన సందర్భంలోనూ ఈ అంశాలను ప్రస్తావించినా, ఫలితం రాలేదని గవర్నర్ వ్యాఖ్యానించారు.

రామ్ పోతినేనికి వైసీపీ బెదిరింపులు - కుల కరోనాపైనా చంద్రబాబు - రాయపాటి శైలజ షాకింగ్ కామెంట్స్రామ్ పోతినేనికి వైసీపీ బెదిరింపులు - కుల కరోనాపైనా చంద్రబాబు - రాయపాటి శైలజ షాకింగ్ కామెంట్స్

 covid-19: trs mla saidi reddy opposed Governor comments on govt measures

గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు సంచలనంగా మారిన వేళ.. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి స్పందించారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలతో ఆయన విభేదించారు. ప్రభుత్వం శక్తికి మించి పనిచేస్తున్నదన్నారు. తమిళిసై రాష్ట్రానికి గవర్నర్ లా కాకుండా, బీజేపీ అధ్యక్షురాలి మాదిరిగా మాట్లాడుతున్నారని సైదిరెడ్డి ఆరోపించారు.

చంద్రబాబుకు మోదీ సర్కార్ ఝలక్? - ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ - అసలుకే ఎసరు?చంద్రబాబుకు మోదీ సర్కార్ ఝలక్? - ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ - అసలుకే ఎసరు?

రాష్ట్ర వైద్య శాఖ మంగళవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1682 పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 93,937కు, మొత్తం మరణాల సంఖ్య 711కు పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 2,070 మంది వైరస్‌ బారి నుంచి కోలుకోగా, మొత్తం డిశ్చార్జీల సంఖ్య 72,202కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 21,024గా ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 19,579 మందికి కొవిడ్ -19 ‌పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 7,72,928 మందికి టెస్టులు చేసినట్లు బులిటెన్ లో పేర్కొన్నారు.

English summary
hours after Telangana Governor Tamilisai Soundararajan expressed unhappy with low number of COVID-19 tests in state, the ruling trs party mla saidi reddy opposed governor comments. mla alleges that governor is acting like bjp state president
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X