• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా విలయం: వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు రద్దు -21న శ్రీరామ నవమి ఆన్ లైన్‌లోనే

|

తెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం, నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5093 కొత్త కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జరగాల్సిన అనేక కార్యక్రమాలు, సినిమా షూటింగ్‌లు, రాజకీయ నాయకుల పర్యటనలు, పలు ఆలయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోనూ దర్శనాలు రద్దయ్యాయి.

తెలంగాణలో ఘోరం: ఒక్కరోజే 15 మంది బలి -తొలిసారి 5,093 కొత్త కేసులు -కేంద్రం షాక్ -వ్యాక్సినేషన్ బంద్తెలంగాణలో ఘోరం: ఒక్కరోజే 15 మంది బలి -తొలిసారి 5,093 కొత్త కేసులు -కేంద్రం షాక్ -వ్యాక్సినేషన్ బంద్

బయటి నుంచే మొక్కులు..

బయటి నుంచే మొక్కులు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొవిడ్ కేసులు అమాంతం పెరగడం, వాటిలో ఎక్కువ కేసులు టెంపుల్ టౌన్ వేములవాడలోనే నమోదవుతోన్న క్రమంలో శ్రీరాజ రాజేశ్వర స్వామి దేవస్థానంలోకి భక్తుల ప్రవేశం నిలిపివేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయం బయట నుంచి మొక్కులు అప్పగించి వెళ్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. దర్శనాల రద్దు ఆదివారం నుంచి ఈనెల 22 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. నాలుగు రోజులు ఆలయంలో అర్జిత సేవలతో పాటు దర్శనాలు, ధర్మశాల అద్దెలు నిషేధించారు.

అప్పుడు కలరా.. ఇప్పుడు కరోనా..

అప్పుడు కలరా.. ఇప్పుడు కరోనా..

గతంలో 1980లో కలరా వ్యాపించిన సందర్భంలో వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయాన్ని 40 రోజులపాటు మూసివేశారు. మళ్లీ గతేడాది కరోనా కారణంగా అలాంటి పరిస్థితే తలెత్తింది. అన్ లాక్ లో భాగంగా తెరుచుకున్న ఆలయాలు కాస్తా ఇప్పుడు రెండో దశ వ్యాప్తితో మళ్లీ మూతపడుతున్నాయి. ప్రస్తుతానికి దర్శనాలను మాత్రమే రద్దు చేసిన అధికారులు.. రాబోయే రోజుల్లో తీవ్రతను బట్టి మూసివేతపై నిర్ణయం తీసుకోనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం ఒక్కరోజే కొత్తగా 106 కేసులు బయటపడ్డాయి. కాగా,

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి భారీ షాక్ -ఎస్టీ హోదాపై హైకోర్టు నోటీసులు -రాజీనామా చేయాలంటూడిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి భారీ షాక్ -ఎస్టీ హోదాపై హైకోర్టు నోటీసులు -రాజీనామా చేయాలంటూ

  What Rahul Gandhi Said in 2020 Is TRUE
  ఆన్‌లైన్‌లో శ్రీరామ నవమి వేడుక

  ఆన్‌లైన్‌లో శ్రీరామ నవమి వేడుక

  వేములవాడలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో ఫిజికల్ దర్శనాన్ని నిలిపేసిన అధికారులు.. భక్తుల సౌకర్యార్థం ఆన్ లైన్‌లోనే స్వామి వారి ఆర్జిత సేవలు అందుబాటులోకి తెచ్చారు. వేములవాడలో ఆదివారం(18) నుంచి 24 వరకు రాములోరి ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ నెల 21న శ్రీ రామనవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం జరగనుంది. ఈ వేడుకలను ఆన్ లైన్ లో వీక్షించవచ్చని, టీఎస్ మీసేవ 2.0 లేదా టీ ఆప్ ఫోలియో ద్వారా అర్జిత సేవల రుసుము చెల్లించి, భక్తుల గోత్ర నామాల మీద మొక్కులు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు.

  English summary
  In the wake of the rapid spread of coronavirus in the temple town Vemulawada, authorities of sri Raja Rajeshwara Swamy temple has cancelled darshan for devotees. The shrine will be closed for devotees for five days, starting from sunday(April 18) to april 22. rajanna sircilla district has recorded 106 new cases, most of them from vemulawada.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X