వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: మా డిమాండ్లు తీర్చితేనే ఓయూలోకి కెసిఆర్ అడుగుపెట్టాలి: విద్యార్థి సంఘాలు

తమ డిమాండ్లు తీర్చాకే ముఖ్యమంత్రి కెసిఆర్ ఉస్మానియా యూనివర్శిటీలోకి అడుగుపెట్టాలని విద్యార్థి సంఘాలు తేల్చిచెప్పాయి.తమ డిమాండ్లకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాము ఆందోళన చేస్తామని విద్యార్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ డిమాండ్లు తీర్చాకే ముఖ్యమంత్రి కెసిఆర్ ఉస్మానియా యూనివర్శిటీలోకి అడుగుపెట్టాలని విద్యార్థి సంఘాలు తేల్చిచెప్పాయి.తమ డిమాండ్లకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాము ఆందోళన చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంబించి వందేళ్ళు పూర్తైన సంద్రభాన్ని పురస్కరించుకొని రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది.అయితే ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ప్రభుత్వం ఆహ్వానించింది.

ఉస్మానియా యూనివర్శిటీలోని విద్యార్థి సంఘాలతో పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి సమావేశమయ్యారు. ఓయూ వైస్ చాన్సిలర్ రామచంద్రం కూడ ఈ సమావేశంలో ఉన్నారు.

CP makes a fervent appeal to OU students

విశ్వవిద్యాలయంలో పాలకమండళ్ళు ఏర్పాటు చేయాలని, పీజీ, పీహెచ్ డీ విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వాలని, అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలని వామపక్షాల అనుబంధ సంస్థలకు చెందిన విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఈ మూడు డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అయితే ఈ సమయంలో విద్యార్థిసంఘాల నాయకుల మద్య ఘర్షణ మొదలై ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు అభ్యంతరం లేదన్నారు. అయితే ఓ బృందంగా వస్తే తానే తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

భద్రత కట్టుదిట్టం

రాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకొని భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీస్ యంత్రాంగం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు భద్రత ఏర్పాట్లను సీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు.శతాబ్ది ఉత్సవాలు శాంతియుతంగా పూర్తయ్యేందుకు విద్యార్థి సంఘాలు సహకరించాలని మహేందర్ రెడ్డి కోరారు. రాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకొని రెండంచెల భద్రతను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు.

English summary
Just two-days ahead of the inaugural function of centenary celebrations of Osmania University, Hyderabad City Police Commissioner M Mahender Reddy made a fervent appeal to student organisations of the university to cooperate during the celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X