వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎర్రవల్లి తరహా డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇక్కడా కట్టండి: చాడ హెచ్చరిక

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు జీ, జీప్లస్‌ వన్‌ ఇళ్లను అంటగట్టి వారి పొట్టకొట్టవద్దని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంక్‌రెడ్డి అన్నారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు జీ, జీప్లస్‌ వన్‌ ఇళ్లను అంటగట్టి వారి పొట్టకొట్టవద్దని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంక్‌రెడ్డి అన్నారు. ఒక ఎర్రవల్లిలోనే కాకుండా అదే తరహాలో వరంగల్‌లోని ప్రజలకు కూడా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం హన్మకొండ ఏకశిల పార్కులో సీపీఐ నగర పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న గుడిసెవాసులందరికీ పట్టాలిచ్చి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కేసీఆర్‌ ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

CPI demand KCR to implement double bedroom scheme in Warangal district

ప్రతీపేదవాడికి 125 గజాల ఇళ్ల స్థలాన్ని కేయించి 2 గందుల ఇళ్లను క్టిస్తానన్న హామీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. జీవో 58ని అమలు చేసి పేదలక న్యాయం చేయాలన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ల ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో సీసీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.

అనంతరం పార్క్‌ నుంచి కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా బయల్దేరిన సీపీఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే సీపీఐ నాయకులు రాస్తారోకో చేప్టారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నంలో తోపులాట జరిగింది. పలువురు సీనియర్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కొద్ది సేపటికే వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి. శ్రీనివాస్‌రావు, జిల్లా కార్యదర్శి సిరిబోయిన కరుణాకర్‌, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు.

జేసీకి వినతి పత్రం

జీవో 58 ప్రకారం గుడిసెవాసులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. ఏకశిలా పార్కులో ధర్నా చేపట్టిన సీసీఐ నాయకులు అక్కడి నుంచి కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి జేసీ దయానంద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గుడిసెవాసులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టివ్వాలని వెంక్‌రెడ్డి కోరారు.

English summary
CPI Telangana State Secretary Chada Venkat Reddy on Thursday demanded that CM KCR to implement double bedroom scheme in Warangal district also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X