వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నయీంను ఎన్‌కౌంటర్ చేయించింది అమిత్ షా, కేసీఆర్ చేతికి రక్తం, అందుకే'

|
Google Oneindia TeluguNews

నల్గొండ: గ్యాంగ్‌స్టర్ నయీంను చంపించింది తెలంగాణ సీఎం కేసీఆర్ కాదని, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గుజరాత్‌లో సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు విచారిస్తున్న సీబీఐ ముందుకు నయీం వస్తే శిక్ష పడి జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఎన్‌కౌంటర్ చేయించారన్నారు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

నయీం బాధితుల సమావేసంలో ఆయన మాట్లాడారు. నయీం ఎన్నో కిడ్నాప్‌లు, హత్యలు, బలవంతపు వసూళ్లు, భూకబ్జాలు చేశారని నారాయణ విమర్శించారు. అలాంటి నయీంను అమిత్ షానే ఎన్‌కౌంటర్ చేయిస్తే, తెలంగాణ సీఎం కేసీఆర్ తానే అంతమొందించినట్లుగా చెప్పుకుంటున్నారన్నారు.

అమిత్ షా ఎన్‌కౌంటర్ చేయిస్తే కేసీఆర్ ప్రచారం

అమిత్ షా ఎన్‌కౌంటర్ చేయిస్తే కేసీఆర్ ప్రచారం

గుజరాత్‌లో సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు విచారిస్తున్న సీబీఐ ఎదుటకు నయీం వస్తే తనకు చిక్కులు తప్పవని అమిత్ షా గుర్తించారని నారాయణ అభిప్రాయపడ్డారు. అందుకే పక్కా ప్రణాళికతో ఎన్‌కౌంటర్ చేయించాడని ఆరోపించారు. అనంతరం తన చేతులకు రక్తం పూసుకుంటున్నట్లుగా కేసీఆర్ ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

మరో నయీంగా చేయాలనే

మరో నయీంగా చేయాలనే

నయీం, అతని ముఠాలు చేసిన నేరాలు వ్యక్తిగా చేసినవి కావని, అవి వ్యవస్థీకృతంగా ప్రభుత్వం, పోలీసులు కలిసి చేసినవి అన్నారు. అందుకే నయీం పోయినా నేరాలు ఆగలేదన్నారు. అతడి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, భువనగిరితో పాటు ఇతర జిల్లాల్లో నయీం భయం నీడలు వెంటాడుతున్నాయన్నారు. శేషన్నను అరెస్టు చేయకపోవడం వెనుక పోలీసుల లక్ష్యం అతడిని మరో నయీంగా తయారు చేయడమేనని ఆరోపించారు.

సిట్‌కు అప్పగించి దులిపేసుకున్నారు

సిట్‌కు అప్పగించి దులిపేసుకున్నారు


వ్యవస్థీకృత నేరాలు ప్రభుత్వం, పోలీసుల సహకారంతో కొనసాగుతాయన్నారు. నయీం ఘటనలో రాష్ట్రంలో పరిపాలించిన నేతలు, పోలీసు అధికారులకు భాగస్వామ్యం ఉందని, లేదంటే యాదాద్రి నరసింహుడి వద్ద ప్రమాణాలు చేస్తారా అని ప్రశ్నించారు. అందుకే నయీం ఎన్‌కౌంటర్ కేసును సిట్‌కు అప్పగించి చేతులు దులుపేసుకున్నారన్నారు.

లేదంటే కేసు ఎప్పుడో మూసేసేవారు

లేదంటే కేసు ఎప్పుడో మూసేసేవారు

నయీం కేసులో ప్రమేయం గల వారిని శిక్షించాలని హైకోర్టులో తాము వేసిన వ్యాజ్యం పెండంగులో ఉన్నదని చెప్పారు. అందుకే దర్యాఫ్తు కొనసాగుతోందని, లేదంటే కేసు ఎప్పుడో మూసేసేవారన్నారు. నయీం వద్ద లభ్యమైన డైరీని ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నారు. బాధితులను, ప్రజలను పక్కదారి పట్టించేందుకు చిన్నవారిని అరెస్టు చేసి పెద్దవారిని వదిలేశారన్నారు. దీనిని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.

English summary
CPI Narayana make hot comments on Bharatiya Janata Party chief Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X