వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజుర్‌నగర్ ఉప ఎన్నికకు CPM సై.. కానీ, రిటర్నింగ్ అధికారుల షాక్..!

|
Google Oneindia TeluguNews

నల్గొండ : హుజుర్‌నగర్ అసెంబ్లీకి జరగబోతున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పక్షంతో సై అంటే సై అంటూ కదన రంగంలో తాడోపేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యారు. ఆ రెండు పార్టీల మధ్య నేను సైతం అంటూ బీజేపీ కూడా దూరింది. హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఈ మూడు పార్టీల మధ్య ముచ్చటగా త్రిముఖ పోటీ నెలకొనగా.. టీడీపీ, సీపీఎం అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అదలావుంటే ఇండిపెండెంట్లు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడం చర్చానీయాంశంగా మారింది. ఈ సందర్భంలో సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరణకు గురి కావడం దుమారం రేపుతోంది.

హుజుర్‌నగర్ ఎన్నికల్లో ఎవరికి మద్దతు...? సమావేశమైన సిపిఐ నేతలు హుజుర్‌నగర్ ఎన్నికల్లో ఎవరికి మద్దతు...? సమావేశమైన సిపిఐ నేతలు

హుజుర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా పోటీ చేసేందుకు సిద్దమైన సీపీఎంకు షాక్ తగిలింది. ఆ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన శేఖర్ రావుకు రిటర్నింగ్ అధికారులు ఝలక్ ఇచ్చారు. ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాలు చెల్లవంటూ మెలిక పెట్టడంతో సీపీఎం నేతలు భగ్గుమంటున్నారు.

cpm candidate nomination rejected in huzurnagar by elections

సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు ఫైరవుతున్నారు. నామినేషన్‌తో పాటు సమర్పించిన ధృవీకరణ పత్రాలు సరిగా లేనందున ఆయన నామినేషన్ తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఉద్యోగులు వెల్లడించారు. ఆ క్రమంలో ఆర్‌వో తీరును నిరసిస్తూ సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. హుజుర్‌నగర్ లోని రిటర్నింగ్ అధికారం కార్యాలయం మెయిన్ గేట్ దగ్గర అభ్యర్థి శేఖర్ రావుతో పాటు కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు.

English summary
CPM Candidate Shekar Rao Nomination Rejected In Huzurnagar Elections. The CPM Leaders Protest against Returning Officer Decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X