వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిపిఎం కొత్త ఫ్రంట్‌: బహుజన లెప్ట్‌ఫ్రంట్‌కు సన్నాహలు, పవన్ దారెటు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 31 పార్టీలతో కలసి బహుజన్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఈ ఫ్రంట్ విధి విధానాలను 2018 జనవరి 28న ప్రకటిస్తామని తమ్మినేని ప్రకటించారు.అయితే ఈ ఫ్రంట్‌కు సిపిఐ దూరంగా ఉండే అవకాశం కన్పిస్తోంది. సిపిఎం నేతలు మాత్రం ఈ ఫ్రంట్‌లో సిపిఐ చేరుతారనే అశాభావంతో ఉన్నారు.మరో వైపు పవన్ కళ్యాణ్ ఈ ఫ్రంట్‌లో చేరే అవకాశం ఉందా లేదా అనే చర్చ కూడ సాగుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో 2019 ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. కెసిఆర్‌కు వ్యతిరేకంగా పార్టీలు, కూటములను ఏర్పాటు చేయనన్నాయి.

అయితే విపక్షాల మధ్య ఓట్ల చీలిక లేకుండా పార్టీలు, కూటములు జాగ్రత్తలు తీసుకొంటాయా, లేదా అనే విషయాన్ని ఇప్పటికిప్పుడే చెప్పలేం. మరో వైపు సిపిఎం కొత్త ఫ్రంట్‌‌తో ముందుకు వస్తోంది. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం నాడు తమ్మినేని వీరభద్రం ఈ ప్రకటన చేశారు.

 బహుజన లెఫ్ట్‌ఫ్రంట్

బహుజన లెఫ్ట్‌ఫ్రంట్

తెలంగాణ రాష్ట్రంలో బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ రూపు దిద్దుకొంటుంది. సిపిఎం దీనికి నేతృత్వం వహించే అవకాశం ఉంది. ఈ ఫ్రంట్‌లో సుమారు 31 పార్టీలను కలుపుకొని పోవాలని నిర్ణయించారు.2018 జనవరి 28వ, తేదిన బహుజన ఫ్రంట్‌ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.

పవన్ చేరేనా?

పవన్ చేరేనా?

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఈ ఫ్రంట్‌లో ఉంటుందా, విడిగా పోటీ చేస్తోందా అనేది ఇప్పటికిప్పుడే చెప్పలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫ్రంట్ విధి విధానాలు ప్రకటించిన తర్వాత ఇతర పార్టీల వైఖరి కూడ తెలిసే అవకాశం లేకపోలేదు.ఇప్పటికే పవన్ ‌తో సిపిఎం రాష్ట్ర తమ్మినేని వీరభద్రం చర్చించారు.అయితే పవన్ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకొంటుందనే విషయాన్ని ఆ పార్టీ కూడ ప్రకటించాల్సి ఉంది. ఈ విషయాలపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశాలు లేకపోలేదు.

 లెప్ట్ పార్టీలు పుంజుకొనే అవకాశం.

లెప్ట్ పార్టీలు పుంజుకొనే అవకాశం.

అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాలు దెబ్బతిన్నాయని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. దేశంలో, రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు పార్టీలు కొంత నష్టపోయాయని ఆయన గుర్తు చేశారు. అయితే లెప్ట్‌పార్టీలు పుంజుకొనే వాతావరణం రాష్ట్రంలో నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు.

 ఫ్రంట్‌కు దూరంగా సిపిఐ

ఫ్రంట్‌కు దూరంగా సిపిఐ

బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌లో చేరేందుకు సిపిఐ అయిష్టతను వ్యక్తం చేసింది. ఈ విషయమై సిపిఐతో చర్చించినట్టు కూడ తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.సీపీఐ కూడా ఫ్రంట్‌లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే లెఫ్ట్‌ పార్టీల్లో సిపిఎం తర్వాత బలంగా ఉన్న సిపిఐ ఈ ఫ్రంట్‌కు దూరంగా ఉంటే రాజకీయంగా ఫ్రంట్‌ ఆశించిన లక్ష్యం నెరవేరుతోందా అనేది ప్రస్తుత చర్చనీయాంశంగా మారింది. అయితే విధి విధానాలను ప్రకటించిన తర్వాత ఫ్రంట్‌పై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

119 స్థానాల్లో పోటీ

119 స్థానాల్లో పోటీ

తెలంగాణలో 119 స్థానాల్లో బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ పోటీ చేయనున్నట్టు తమ్మినేని వీరభద్రం చెప్పారు.తెలంగాణలో సామాజిక న్యాయం, రాష్ట్రం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పోరాటం చేస్తామని వెల్లడించారు.తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా నిలిచి, సీపీఎంను గెలిపించాలని వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తామని వీరభద్రం ప్రకటించారు.

English summary
We will establish Bahujana left front said CPM state secretary Tammineni Veerabhadram.Tammineni participated cpm conference held at Khamman on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X