కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరీంనగర్ పుష్కర ఘాట్‌లో మొసలి కలకలం, భక్తుల పరుగు

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద తుపాకీ కలకలం మరవకముందే, కరీంనగర్ జిల్లాలో పుష్కర ఘాట్ వద్ద ఓ మొసలి కలకలం చెలరేగింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం బాలమ్మ రేవు ఘాట్ వద్ద మొసలి కనిపించింది. దీంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. పరుగులు పెట్టారు.

వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో మొసలిని పట్టుకున్నారు. పుష్కర ఘాట్ పక్కన దానిని ఉంచారు.

బాలమ్మ రేవు పుష్కర ఘాట్‌కు పదుల సంఖ్యలో భక్తులు వచ్చారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొసలిని గుర్తించిన భక్తులు సమాచారం ఇవ్వడంతో ప్రమాదం తప్పింది.

Crocodile in Karimnagar Pushkar Ghat

బాసర పుణ్యక్షేత్రంలోని గోదావరి పరిస్థితి దయనీయంగా మారుతోంది. పుష్కరాలు ప్రారంభమైన మొదటి రోజుతో పోల్చుకుంటే క్రమంగా గోదావరిలో నీటి మట్టం తగ్గుతోంది. పైభాగంలోని శ్రీరాంసాగర్లో నీటి విడుదల కొనసాగుతుండటంతో దాని ప్రభావం గోదావరిపై పడుతోందని సమాచారం.

పుష్కర ఘాట్ల వద్ద నీరు ఎక్కువగా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఘాట్లను దిలి ఖాళీ ప్రదాశాలలోకి వెళ్లి స్నానాలు చేసి వస్తున్నారు. గోదావరి ఒడ్డును బురద నీటిలోను సైతం స్నాలు చేస్తుండటం గమనార్హం.

English summary
Crocodile in Karimnagar Pushkar Ghat
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X