మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మృతి: 'పాలకంటే పనే ముఖ్యమన్నాడు' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

మెదక్: "కన్నబిడ్డ కడతేరిపోతే కడచూపూ దక్కనివ్వలేదు. ఆకలితో అల్లాడే పసివాడికి పాలివ్వడంకన్నా పనే ముఖ్యమన్నాడు. తల్లి తల్లడిల్లుతున్నా కొడుకును మట్టిలో కలిపేసి, పిడికెడు మన్నయినా వెయ్యనివ్వలేదు" మెదక్ జిల్లా తుర్ఖలఖానాపూర్ శివారులో ఈఎంఆర్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్లి బిడ్డను పోగొట్టుకున్న దళిత మహిళ మల్లీశ్వరి జాయింట్ కలెక్టర్‌తో చెప్పిన మాటలివి.

తమను ఆదుకోవాలంటూ సోమవారం జాయింట్ కలెక్టర్‌కి వినతిపత్రం సమర్పించింది. "బిడ్డకు పాలిస్తాను సారూ! అని అడిగితే... పాలు లేదు, గీలు లేదు.. ఇచ్చిన డబ్బుకు కష్టం చేయాల్సిందే"నని కాంట్రాక్టర్ గద్దించాడని ఆక్రోశించింది. దీంతో విచారణ చేపట్టాలని కార్మిక శాఖ అధికారులను జేసీ ఆదేశించారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టర్ కర్కశత్వాన్ని వివరించింది. కుటుంబం కోసం మేస్త్రీ వద్ద డబ్బు తీసుకున్నామని, దాంతో ఓ పరిశ్రమకు తీసుకువెళ్లగా పొద్దుగూకింది మొదలు పొద్దెక్కే దాగా పనిచేయించేవారని తెలిపింది. మధ్యలో కొడుకుకు పాలిచ్చి వస్తానంటే అనుమతించే వారు కాదని వాపోయింది.

దీంతో పసిబిడ్డ ఆకలికి ఏడ్చి ఏడ్చి చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. అది తెలిసి ఏడుస్తున్నా, వెళ్లనివ్వకపోగా ఏడవకూడదని గద్దించినట్లు చెప్పింది. వ్యాన్‌లో మామిడి తోటకు తీసుకెళ్లి మృతదేహాన్ని పూడ్చేశారని, తనను పిడికెడు మన్ను కూడా వేయనివ్వలేదని అవేదన వెలిబుచ్చింది.

 'పాలకంటే పనే ముఖ్యమన్నాడు'

'పాలకంటే పనే ముఖ్యమన్నాడు'

మెదక్ జిల్లా తుర్ఖలఖానాపూర్ శివారులో ఈఎంఆర్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్లి బిడ్డను పోగొట్టుకున్న దళిత మహిళ మల్లీశ్వరి జాయింట్ కలెక్టర్‌తో చెప్పింది. తమను ఆదుకోవాలంటూ సోమవారం జాయింట్ కలెక్టర్‌కి వినతిపత్రం సమర్పించింది.

 'పాలకంటే పనే ముఖ్యమన్నాడు'

'పాలకంటే పనే ముఖ్యమన్నాడు'

అంతటితో వదలక సంతకం పెట్టాలని సతాయించేవారని, రాత్రికి రాత్రే బయటపడి నవాబ్‌పేట మండలంలోని స్వగ్రామం కాకర్లపాడు వెళ్లి పోయానని తెలిపింది. కాగా, సదరు కర్కశ కాంట్రాక్టర్‌పై విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ తెలంగాణ శాఖ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 'పాలకంటే పనే ముఖ్యమన్నాడు'

'పాలకంటే పనే ముఖ్యమన్నాడు'

బాలుడి మృతి ఉదంతంపై సోమవారం జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్ధ కార్యదర్శి జడ్జి కనకదుర్గ ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. ఆమె వెంట తహసీల్దార్ ప్రతాప్ రెడ్డి, చైల్డ్ లైన్ డైరెక్టర్ ఉమేష్ చంద్ర, నర్సాపూర్ సీఐ రాంరెడ్డి, ఎస్ ఐ పెంటయ్య కూడా ఉన్నారు. సమాచారమిచ్చేవారు ఎవరూ లేకపోవడంతో కూలీలతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు.

 'పాలకంటే పనే ముఖ్యమన్నాడు'

'పాలకంటే పనే ముఖ్యమన్నాడు'

ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీకి సూచిస్తామన్నారు. తన బిడ్డకు పాలివ్వకుండా మల్లీశ్వరిని కాంట్రాక్టర్ అడ్డుకోగా, పసిబాలుడు మృతి చెందిన సంఘటనపై పూర్తి స్ధాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని లోకయుక్త జస్టిస్ సుబాషణ్ రెడ్డి సోమవారం మెదక్ జిల్లా ఎస్పీని ఆదేశించారు.

English summary
In a gruesome incident, a six month old infant died after his mother was denied permission to provide milk by her merciless contractor.The incident occurred in Turkalakhanapur village in Hathnoora mandal of Medak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X