వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గజల్ శ్రీనివాస్‌కు మరో షాక్: సామాజిక బహిష్కరణ వేటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

గజల్ శ్రీనివాస్‌ పై సామాజిక బహిష్కరణ వేటు, చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

హైదరాబాద్‌: మహిళలను లైంగిక వేధింపులకు గురి చేశాడనే ఆరోపణపై కటకటాలు లెక్కిస్తున్న గజల్ శ్రీనివాస్‌పై దెబ్బ దెబ్బ పడుతోంది. ఆయనపై పలు సాంస్కృతిక సంఘాలు మండిపడ్డాయి.

తన కార్యాలయంలో పనిచేసే ఓ యువతిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన గజల్ శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించాలని ఆనందలహరి సాంస్కృతిక సంస్థ డిమాండ్‌ చేసింది. కళను అడ్డంపెట్టుకొని మహిళల్ని లొంగదీసుకుంటున్న శ్రీనివాస్‌ను సామాజికంగా తమ సంస్థ బహిష్కరిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

మిగతా సంస్థలు సైతం...

మిగతా సంస్థలు సైతం...

మిగతా కళా సంస్థలు కూడా గజల్ శ్రీనివాస్‌ను సామాజికంగా బహిష్కరించాలని ఆనందలహరి ప్రతినిధి సూచించారు. కొందరు ఆయనకు మద్దతుగా మాట్లాడటంపై ఆ సంస్థ అభ్యంతరం తెలిపింది.

నీరు గార్చేందుకు కుట్ర చేస్తున్నారు...

నీరు గార్చేందుకు కుట్ర చేస్తున్నారు...

గజల్ శ్రీనివాస్ కేసును నీరుగార్చేందుకు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ఆనందలహరి ప్రతినిధి. ఈ కేసును సమగ్రంగా విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆనందలహరి సంస్థ కన్వీనర్‌ మల్లం రమేశ్‌ అన్నారు.

అపహాస్యం చేసే విధంగా..

అపహాస్యం చేసే విధంగా..

గజల్‌ శ్రీనివాస్‌ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ కళారంగాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారని మల్లం రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి కంటూ సాయన్న, చల్లా సరోజినీదేవి, సీనియర్‌ నటి ఆనందలక్ష్మి, రామడుగు వాసంతి, మోహన్కుమార్‌ గాంధీ, మిమిక్రి కళాకారులు రాంబాబు, జానపద నాయకులు బాలస్వామి, సాయిబాబా పాల్గొన్నారు.

గజల్ శ్రీనివాస్‌కు చుక్కెదురు..

గజల్ శ్రీనివాస్‌కు చుక్కెదురు..


గజల్‌ శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌ నాంపల్లి కోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని ప్రాసీక్యూషన్‌ న్యాయవాది వాదించారు. ఆయన వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసింది. లైంగిక వేధింపుల కేసులో గజల్‌ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

English summary
Ananda Lahari cultural association expressed angry at Ghazal Srinivas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X