వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్ సెంటర్ల నుండే కేటుగాళ్ళకు సమాచారమిలా..కమీషన్ కోసమే

జాతీయ బ్యాంకులు తమ ఖాతాదారులకు అవసరమైన సేవలందించేందుకుగాను ఏర్పాటుచేసుకొన్న కాల్ సెంటర్ల నుండే ఖాతాదారుల సమాచారం బహిర్గతమైందని కీలకమైన ఆధారాలు లభించాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :జాతీయ బ్యాంకులు తమ ఖాతాదారులకు అవసరమైన సేవలందించేందుకుగాను ఏర్పాటుచేసుకొన్న కాల్ సెంటర్ల నుండే ఖాతాదారుల సమాచారం బహిర్గతమైందని కీలకమైన ఆధారాలు లభించాయి.

జాతీయ బ్యాంకులు తమ ఖాతాదారులకు సేవలందించేందుకుగాను కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు.అయితే ఈ కాల్ సెంటర్ల ద్వారా ఖాతాదారుల సమస్యలను పరిష్కరించనుంది.

అయితే ఖాతాదారుల సమాచారం కేటుగాళ్ళకు బిపివో కేంద్రాల నుండి బహిర్గతమౌతోంది.దీని కారణంగానే ఖాతాదారులు మోసపోతున్నారు.

సైబరాబాద్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన కరంతాడ్ ద్వయం కేసులో బిపివో నుండే ఖాతాదారుల సమాచారం లీకైనట్టు కీలకమైన ఆధారాలు సేకరించారు.

బిపివో సెంటర్ నుండి సమాచారం లీక్

బిపివో సెంటర్ నుండి సమాచారం లీక్

జాతీయ బ్యాంకులు ఖాతాదారులకు అవసరమైన సేవలు అందించేందుకు ఏర్పాటు చేసుకొన్న కాల్ సెంటర్ల నుండి ఖాతాదారుల సమాచారం లీక్ అవుతోందని పోలీసులు ఆధారాలను సేకరించారు. కొందరు బిపివో ఉద్యోగులు ఖాతాదారుల సమాచారాన్ని లీక్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.ఓ కేసును పరిశోధన సమయంలో పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు.

 సమాచారం సేకరించి డబ్బులిలా

సమాచారం సేకరించి డబ్బులిలా

బ్యాంకులు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ఉద్యోగుల మాదిరిగా ఖాతాదారులకు ఫోన్లు చేసి సమాచారాన్ని సేకరించి , ఆ సమాచారం ఆధారంగా బ్యాంకు ఖాతాల నుండి డబ్బులను కాజేస్తున్నారు.జమ్ తార కేంద్రంగా దందాలు సాగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

సైంటిస్ట్ కేసు దర్యాప్తులో ముఠా గుట్టురట్టు

సైంటిస్ట్ కేసు దర్యాప్తులో ముఠా గుట్టురట్టు

హైద్రాబాద్ నగరానికి చెందిన ఓ సైంటిస్ట్ కేసుతో జమ్ తార గ్యాంగ్ వ్యవహరం వెలుగుచూసింది. నగరంలోని డిఆర్ డి ఓలో పనిచేసే ఓ సైంటిస్ట్ ఎస్ బి ఐ కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేశాడు. ఆయనకు 24 గంటల్లోనే కాల్ సెంటర్ నుండి ఫోన్ వచ్చింది. ఫిర్యాదును పరిష్కరించేందుకు ఫోన్ చేశామని చెప్పారు. మరో బ్యాంకు ఖాతా వివరాలను చెప్పాలని కోరారు. ఈ ఖాతా వివరాలతో ఆయన బ్యాంకు ఖాతాలోని రూ.1.09 లక్షలను ఈ ముఠా కాజేసింది.

జమ్ తార కేంద్రంగా ముఠా కార్యకలాపాలు

జమ్ తార కేంద్రంగా ముఠా కార్యకలాపాలు

జార్ఖండ్..పశ్చిమబెంగాల్ మధ్య ఉన్న జమ్ తార కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. బ్యాంక్ కాల్స్ పేరుతో ఇటీవల ఖాతాదారులకు విపరీతంగా పోన్లు వస్తున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రసాద్ నేతృత్వంలో మనీష్ బర్నవాల్, వికాస్ కుమార్ రావణిని పట్టుకొన్నారు.సైంటిస్ట్ ఖాతా నుండి డబ్బులు కాజేసింది ఈ ముఠా సభ్యులేనని తేల్చారు పోలీసులు.

సైబర్ నేరగాళ్ళకు సహకరిస్తోన్న బిపివోలు

సైబర్ నేరగాళ్ళకు సహకరిస్తోన్న బిపివోలు

మనీష్, వికాష్ ఇళ్ళల్లో సోదాలు నిర్వహించారు పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులకు కోల్ కతా పోలీసులు నోటీసు ఇచ్చారని తేలింది ఈ నోటీసు ఆధారంగా పోలీసులు కేసును చేదించారు. బెంగాల్ లోని ఎస్ బి ఐ కాల్ సెంటర్ ను ఇంటెల్ నెట్ గ్లోబల్ సర్వీసెస్ బిపివో సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో పనిచేసే విధాన్ దాస్ ఇతర ఉద్యోగులు సైబర్ నేరగాళ్ళకు సహకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఖాతాదారుల నుండి వచ్చే ఫిర్యాదులను కమీషన్ తీసుకొని మనీష్ , వికాష్ లు సైబర్ నేరగాళ్ళకు అందిస్తున్నారు. లీకేజీ వ్యవహరాన్ని గుర్తించిన కోల్ కతా పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
customers data leaked by bpo employees ,cyberabad crime police arrested two members in westbengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X