హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

need 6.8 lakhs: అకౌంటెంట్‌కు సీఎండీ పేరుతో ఈ-మెయిల్, మనీ ట్రాన్స్‌ఫర్, ఫేక్ అని...

|
Google Oneindia TeluguNews

సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త పంథాను అనుసరిస్తూ మోసం చేస్తున్నారు. వ్యక్తులనే కాదు కంపెనీలను కూడా ఛీట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ కంపెనీని బురిడీ కొట్టించారు. సీఎండీ పేరుతో మెయిల్ పంపించి.. ఏకంగా రూ.6.8 లక్షలు దోచుకున్నారు. తర్వాత అసలు సీఎండీకి సమాచారం పంపించగా.. తాను డబ్బులు పంపించమని అడగలేని అనడంతో అకౌంటెంట్ నోరెళ్లబెట్టారు. కేటుగాళ్లు మోసం చేశారని భావించి సైబర్ పోలీసులను ఆశ్రయించారు.

హైదరాబాద్‌లో పిత్తి ఇంజినీరింగ్ లిమెటిడె్ కంపెనీ ఉంది. అయితే కంపెనీ అకౌంటెంట్‌కు వారం రోజుల క్రితం సీఎండీ నుంచి మెయిల్ వచ్చింది. తాను మీటింగ్‌లో ఉన్నానని.. వెంటనే రూ.6.8 లక్షల నగదు ట్రాన్స్‌ఫర్ చేయాలని అందులో ఉంది. సీఎండీ పేరుతో మెయిల్ రావడంతో అకౌంటెంట్ వెంటనే స్పందించారు. రూ.6.8 నగదును మెయిల్‌లో ఉన్న వివరాల ఆధారంగా పంపించారు. తర్వాత ధృవీకరించుకుందామని... అసలు సీఎండీకీ మేసెజ్ చేశాడు.

cyber cheaters send email to company and get 6.8 lakhs..

మేసెజ్ చూసి.. తాను డబ్బు అడగలేదని సీఎండీ అనడంతో అకౌంటెంట్ బిత్తరపోయాడు. తనకు వారం క్రితం మెయిల్ వచ్చిందని చూపించాడు. ఆ మెయిల్ ఎవరిదీ, ఎక్కడి నుంచి వచ్చిందని ఆరాతీయగా నకిలీదని తేలింది. దీంతో కంపెనీని సైబర్ మోసగాళ్లు ఛీట్ చేశారని అర్థమైంది. వెంటనే వారు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. కంపెనీ ఫిర్యాదు మేరకు.. సైబర్ కేటుగాళ్లను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

English summary
cyber cheaters send email to company and get 6.8 lakhs in hyderabad pitti engineering company
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X