వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరోయిన్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి.. బూతు వెబ్ సైట్లలో పెట్టి.. లక్షలు సంపాదించాడు కానీ..

ఏ ఉద్యోగం చేయనక్కర్లేదు.. పెద్దగా కష్టపడనక్కర్లేదు.. అయినా లక్షల రూపాయల డబ్బు గడించవచ్చు. చేయాల్సిందల్లా.. ఆన్ లైన్ వెబ్ సైట్ ఏర్పాటు చేసుకోవడం, వాటిలో సినిమా హీరోయిన్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి పెట్టడం

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏ ఉద్యోగం చేయనక్కర్లేదు.. పెద్దగా కష్టపడనక్కర్లేదు.. అయినా లక్షల రూపాయల డబ్బు గడించవచ్చు. చేయాల్సిందల్లా.. ఆన్ లైన్ వెబ్ సైట్ ఏర్పాటు చేసుకోవడం, వాటిలో సినిమా హీరోయిన్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి పెట్టడం.. అంతే!

అర్రె.. ఇదేదో బాగానే ఉందే అనుకున్నాడు అతడు.. ఒకటి కాదు, ఏకంగా నాలుగు వెబ్ సైట్లు క్రియేట్ చేశాడు. అశ్లీల వెబ్‌సైట్లను నడపడమే వృత్తిగా మార్చుకుని, ఆన్ లైన్ యాడ్స్ ద్వారా డబ్బు గడిస్తూ లక్షలు సంపాదించడం మొదలుపెట్టాడు.

కానీ, పాపం పండింది. ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు దాసరి ప్రదీప్. గత మూడు సంవత్సరాలుగా ఇతడు ఈ విధమైన వ్యాపారంలో ఆరితేరిపోయాడని సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చారు.

ఆన్ లైన్ లో సులువుగా డబ్బు సంపాదించేందుకు...

ఆన్ లైన్ లో సులువుగా డబ్బు సంపాదించేందుకు...

ఆన్ లైన్ లో డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. కానీ అత్యంత సులువుగా డబ్బు సంపాదించాలని చెడు మార్గం ఎంచుకున్నాడు దాసరి ప్రదీప్. అశ్లీల వెబ్‌సైట్లను నడపడమే వృత్తిగా మార్చుకున్నాడు. ఒక్క వెబ్ సైట్ తో వీక్షకుల సంఖ్య ఆశించిన స్థాయిలో ఉండదనుకున్నాడో ఏమోగానీ.. ఏకంగా నాలుగు వెబ్ సైట్లు ఏర్పాటు చేశాడు.

 నగ్న శరీరాలకు.. హీరోయిన్ల తలలు...

నగ్న శరీరాలకు.. హీరోయిన్ల తలలు...

సినిమా హీరోయిన్ల హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్ చేయడం, నగ్న శరీరాలకు హీరోయిన్ల తలలు అతికించడం, హీరోయిన్లు శృంగారంలో ఉన్నట్టుగా ఫొటోలను డిజైన్ చేయడం, అత్యంత అసభ్యమైన రీతిలో వాటిని తయారు చేయడం.. ఇదే అతడి వ్యాపారం. ఫొటోషాప్ టెక్నిక్స్ తో అశ్లీల చిత్రాలను తయారు చేసి.. వాటిని తన సైట్లలో ప్రదర్శించసాగాడు. ఇలాంటి బొమ్మలను వీక్షించడానికి ఉత్సాహం చూపే వారు ఇతడి సైట్లను సందర్శించడంతో ఇతడికి డబ్బు రావడం మొదలైంది.

 అశ్లీల చిత్రాలతో లక్షల్లో సంపాదన...

అశ్లీల చిత్రాలతో లక్షల్లో సంపాదన...

మూడేళ్లుగా ప్రదీప్ ఈ విధమైన వ్యాపారంలో ఆరితేరిపోయాడు. ప్రతి వారం అతడి ఖాతాలో యాడ్స్ కు సంబంధించిన డబ్బు జమ అయ్యేది. ఒక్క వెబ్ సైట్ నుంచి వారానికి రూ.5 వేలకుపైగా సంపాదన ఉన్నట్లు అతడే స్వయంగా అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. నాలుగు సైట్లను నిర్వహిస్తూ ప్రతి నెల చాలా డబ్బు సంపాదించానని... మూడేళ్లుగే ఇదే పనితో లక్షల రూపాయలు పొందినట్టుగా అతడు ఒప్పుకున్నాడు.

 ఫిర్యాదుతో ‘ఆట' కట్టు...

ఫిర్యాదుతో ‘ఆట' కట్టు...

ఆన్ లైన్ లో ఉన్న దాదాపు 30 అశ్లీల వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్ల గురించి ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇలాంటి వెబ్ సైట్లపై పోలీసులు ఆరా తీశారు. మా ఫిర్యాదు చేసిన వెబ్ సైట్లలో ప్రదీప్ నిర్వహిస్తున్నవే కాక ఇంకా మరికొన్ని బూతు వెబ్ సైట్లు ఉన్నాయి. బెంగళూరులో సోమవారం ప్రదీప్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని హైదరాబాద్ కు తరలించారు. మిగిలిన వెబ్ సైట్ల అడ్మిన్‌లందరి మీదా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

English summary
Cracking the whip on obscene web portals and scandalous YouTube channels, the Cyber Police on Monday arrested one Dasari Pradeep, who runs a website that peddles sleazy content, from Bengaluru city. According to the police, the accused Dasari had been running four websites with explicit and morphed content from Bengaluru. It may be recalled that the Movie Artistes Association (MAA) had lodged a complaint with the Telangana police against such websites and YouTube channels. These content managers lure netizens to click on the links of the websites by uploading objectionable and morphed photographs of Tollywood actresses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X