హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్యాంకులు, కార్డ్ హోల్డర్లే టార్గెట్: 10మంది నైజీరియన్ల అరెస్ట్

నగరంలోఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న 10 మంది నైజీరియన్లను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వివరాలను వెల్లడించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న 10 మంది నైజీరియన్లను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వివరాలను వెల్లడించారు. సైబర్ మోసాలకు పాల్పడుతున్న వీరిని ఢిల్లీలో అరెస్టు చేశామని తెలిపారు.

నైజీరియన్ల నుంచి 9 ల్యాప్‌ట్యాప్స్, 26 మొబైల్స్, 10 ఇంటర్నెట్ డాంగిల్స్, 35 సిమ్‌కార్డులు, ఒక ఐపాడ్, హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ మహేశ్ తెలిపారు. బ్యాంకులు, క్రెడిట్ కార్డుల నుంచి ఈ ముఠా డబ్బులు దొంగిలిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు.

cyber crimes: 10 nigerians arrested

నిందితులు ఫేస్‌బుక్ ద్వారా పరిచయాలు చేసుకొని డబ్బులు లూఠీ చేస్తున్నారని తెలిపారు. కొరియర్లు వచ్చాయి.. రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాలంటూ నైజీరియన్లు మోసాలకు పాల్పడుతున్నట్లు సీపీ వివరించారు.

నైజీరియన్ల ముఠాపై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కేసులు ఉన్నాయని తెలిపారు. పాస్‌పోర్టు లేకుండా నగరంలో నైజీరియన్లు ఉన్నారని తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చి నగరంలో నివాసం ఉంటున్న వారి కోసం సమగ్ర సర్వే నిర్వహించామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. అక్రమంగా ఉంటున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

English summary
10 nigerians arrested by Rachakonda police for cyber crimes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X