కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ టెక్కీ విద్యార్థికి భారీ టోకరా: లక్కీ డ్రా పేరుతో 24లక్షలు కాజేశారు!

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: లక్కీ డ్రా ద్వారా చెవర్‌లెట్ ఆటో మొబైల్ కంపెనీ నుంచి జీబీపీ (గ్రేట్ బ్రిటన్ పౌండ్స్) 2.5లక్షలు(సుమారు రూ. 2.42కోట్లు) గెలుచుకున్నారంటూ మాయమాటలతో రూ. 24లక్షలు కాజేసిన నైజీరియన్ ముఠాను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిం దితులను శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచారు.

ఈ సందర్భంగా ఎస్పీ జోయల్ డేవిస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బసంత్‌నగర్‌కు చెందిన వొడ్నాల సాయితేజ హైదరాబాద్ నగరంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఏప్రిల్ 27న అతని జీ మెయిల్ ఐడీకి రెండున్నర లక్షల బ్రిటన్ పౌండ్స్ ( దాదాపు రూ.2.42కోట్లు) గెలుచుకున్నారని మెయిల్ వచ్చింది.

కాగా, ఆ సమాచారం నిజమేనని నమ్మిన సాయితేజ వారు ఇచ్చి న సెల్‌నంబర్ల ద్వారా సంప్రదించాడు. ఆ సొమ్మును ఆర్‌బీఐ ద్వారా బదిలీ చేస్తామనీ, దాని కోసం ముందస్తుగా రూ.15వేలు డిపాజిట్ చేయాలని సూచించారు. అనంతరం ఎఫ్‌బీఐ క్లియరెన్స్ రావాలనీ, పెద్ద మొత్తం సొమ్ము కాబట్టి రూ.24లక్షలు డిపాజిట్ చేయాలని సాయితేజను నమ్మించారు.

Cyber gang dupes Hyderabad tech student, Rs 24 lakh gone

దీని కోసం నాలుగు అకౌంట్లలో పలు దఫాలుగా రూ.24లక్షలు జమచేశాడు. అనంతరం మరికొంత డబ్బుకోసం డిమాండ్ చేశారు. చివరికి అనుమానం వచ్చి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశా డు. దీనిపై స్పందించిన ఎస్పీ, బసంత్‌నగర్ పోలీసులను కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

ఈ ఘటనపై బసంత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు ప్రారంభించగా సైబర్ క్రైంగా గుర్తించి సీఐడీ ద్వారా దర్యాప్తు ముమ్మ రం చేశారు. నిందితులు ఢిల్లీ, హర్యానా ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా పెద్దపల్లి డీఎస్పీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో సీఐ మహేశ్, ఈసీఆర్ ఇన్ స్పెక్టర్ శశిధర్‌రెడ్డి, సీఐడీ టెక్నికల్ విభాగం సిబ్బందితో ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలకు వెళ్లి ఆధారాలు సేకరించారు.

నైజీరియాకు చెందిన పెద్ది మిలాన్, కెల్విన్ సహా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మహ్మద్ అసీన్‌ను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.29 లక్షలు, రెండు ల్యాప్‌టాప్‌లు, తొమ్మిది మొబైల్ ఫోన్లు, క్రెడిట్ కార్డులను స్వాధీ నం చేసుకున్నారు. నిందితులు ఇతర దేశస్తులు కావడంతో ఢిల్లీ సాకేత్ కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్ తీసుకొచ్చారు.

ఈ ముఠాలో ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారనీ, వారి కోసం అన్వేషణ కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. నైజీరియన్ ముఠాను పట్టుకున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృం దాన్ని ఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు. అపరిచిత వ్యక్తుల నుంచి మెయిల్, సందేశాల ద్వారా వచ్చి న మోసపూరిత ప్రకటలను చూసి డబ్బులు డిపాజిట్ చేయవద్దని ఎస్పీ సూచించారు. ఏఎస్పీ అన్నపూ ర్ణ, డీఎస్పీ మల్లారెడ్డి, సీఐలు ఎడ్ల మహేశ్, శశిధర్‌రెడ్డి, ఎస్‌ఐలు విజేందర్, లక్ష్మీనారాయణ ఉన్నారు.

English summary
Vodnala Sai Teja, a B.Tech first year student from Ramagundam, fell for an email that he received on April 27, stating that he had won GBP 2.50 lakh (nearly Rs 2.42 crore) in a lucky draw held by the Chevrolet Automobile Company of UK.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X