హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఔట్ సోర్సింగ్ పేరుతో మోసం: ఛేజ్ చేసి మరీ పట్టుకున్న పోలీసులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఔట్ సోర్సింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని రూ. లక్షలు సంపాదించుకోవచ్చంటూ ఘరానా మోసానికి పాల్పడిన సైబర్‌ నేరగాడు విపుల్‌ అలీని అసోం రాజధాని గౌహతిలో అరెస్ట్‌చేసి శుక్రవారం హైదరాబాద్‌కు తీసువచ్చారు. సైబరాబాద్‌ ఓఎస్డీ డాక్టర్‌ నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మాదాపూర్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఎండీ ఇంటర్నెట్‌లో ఔట్ సోర్సింగ్ విభాగాల కోసం చూస్తుండగా... విపుల్‌ అలీ ఫోన్‌ నంబరు కనిపించింది. అతడికి ఫోన్‌ చేయగా... తాను ఆర్చర్‌ బీపీవో ప్లానెట్‌ డైరెక్టర్, హైదరాబాద్‌లో ఔట్ సోర్సింగ్ కార్యాలయం ప్రారంభించాలనుకుంటున్నామని చెప్పాడు.

ఔట్ సోర్సింగ్ పేరుతో ఘరానా మోసం

ఔట్ సోర్సింగ్ పేరుతో ఘరానా మోసం

ఆ ఔట్ సోర్సింగ్ కార్యాలయాన్ని తాను ఆరంభిస్తానంటూ ఆ ఎండీ చెప్పగా.. రూ.9.15లక్షలు అడ్వాన్స్‌గా ఇవ్వాలంటూ విపుల్‌ చెప్పాడు. ఆ డబ్బు పంపిన వెంటనే ప్రాజెక్టులు చేయాలని 20 మంది ఐటీ నిపుణులను నియమించుకోవాలని సూచించాడు.

 ఔట్ సోర్సింగ్ పేరుతో ఘరానా మోసం

ఔట్ సోర్సింగ్ పేరుతో ఘరానా మోసం

దీంతో ఆ ఎండీ 20 మందిని నియమించుకుని పనులు చేయించాడు. విపుల్‌ చెల్లించాల్సిన సొమ్ము రూ.76 లక్షలను అడగ్గా చేతులెత్తేయడంతో పాటు ఫోన్‌లో స్పందించలేదు. విచారణలో తాను చెల్లించిన సొమ్ము పేరుతో విపుల్‌ వందల మంది వద్ద రూ.లక్షలు వసూలు చేసుకున్నాడని తెలుసుకున్నాడు.

 ఔట్ సోర్సింగ్ పేరుతో ఘరానా మోసం

ఔట్ సోర్సింగ్ పేరుతో ఘరానా మోసం

దీంతో ఈనెల 10వ తేదీన సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విపుల్‌ వివరాలపై పోలీసులు కూపీ లాగగా మేఘాలయాలోని ఈస్ట్‌గోరోహిల్స్‌ నివాసిగా గుర్తించారు. గౌహతిలోని భాస్కర్‌ చక్రవర్తి అనే మిత్రుడి వద్ద ఉన్నట్టు సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందింది.

 ఔట్ సోర్సింగ్ పేరుతో ఘరానా మోసం

ఔట్ సోర్సింగ్ పేరుతో ఘరానా మోసం

సైబర్‌ క్రైమ్‌ సీఐ రియాజుద్దీన్‌ బుధవారం గౌహతికి చేరుకొని పల్టాన్‌ బజార్‌ పోలీసులకు విషయాన్ని వివరించారు. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు పథకం రచించారు. నిందితులను జీఎస్‌ రోడ్‌ వద్దకు రావాలని పోలీసులు సూచించగా విపుల్‌, భాస్కర్‌లు స్కార్పియో వాహనంలో వచ్చారు. పోలీసులను చూసి పారిపోతుండగా ఛేజ్ చేసి మరీ వీరిని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఒక పిస్తోలు, 4 తూటాలు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Cyberabad police arrested two people having illegal business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X