వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థుల ఆత్మహత్యలపై వారం రోజుల తర్వాత స్పందిస్తారా కేసీఆర్ ..ఎంత దారుణం అన్న డీకే అరుణ

|
Google Oneindia TeluguNews

ఇంటర్ ఫలితాల గందరగోళంతో విద్యార్థులు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగారు. విద్యార్థులకు బాసటగా అటు కాంగ్రెస్, బీజేపీ కూడా ఆందోళన బాట పట్టింది. రాష్ట్ర వ్యాప్త కలెక్టర్ కార్యాలయాల ముట్టడి చేసిన ప్రతిపక్ష పార్టీలు అధికార టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యాయి.

విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన వారానికా సీఎం స్పందించేది .. డీకే అరుణ ఫైర్

విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన వారానికా సీఎం స్పందించేది .. డీకే అరుణ ఫైర్

విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడ్డ వారం రోజుల తర్వాత సీఎం కేసీఆర్ స్పందించడం దారుణమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ విమర్శించారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై గవర్నర్ నరసింహన్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం, మీడియాతో మాట్లాడిన డీకే అరుణ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, కేసీఆర్ కు ఎన్నికలపై ఉన్న శ్రద్ద విద్యార్థులపై లేదని మండిపడ్డారు.

ఆత్మహత్యల పాపం ప్రభుత్వానిదే .. గ్లోబరీనాపై కేసులు నమోదు చెయ్యాలి

ఆత్మహత్యల పాపం ప్రభుత్వానిదే .. గ్లోబరీనాపై కేసులు నమోదు చెయ్యాలి

కేసీఆర్ పాలన ఫాంహౌస్ కే పరిమితమైందని, అవినీతితో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని విమర్శించారు.తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల పాపం ప్రభుత్వానిదే అని డీకే అరుణ అన్నారు . గ్లోబరీనా సంస్థపై కేసులు నమోదు చెయ్యాలని, ఆ సంస్థకు బాధ్యత అప్పగించటంలో కేటీ ఆర్ పాత్ర ఉందని ఆమె ఆరోపించారు.

మంత్రిని తొలగించాలని డిమాండ్ .. ప్రభుత్వ నిర్లక్ష్యం దారుణమైనది అన్న డీకే అరుణ

మంత్రిని తొలగించాలని డిమాండ్ .. ప్రభుత్వ నిర్లక్ష్యం దారుణమైనది అన్న డీకే అరుణ

ఈ అవకతవకలకు బాధ్యులని చేస్తూ మంత్రి జగదీష్ రెడ్డి ని తొలగించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 20 మంది విద్యార్థులు ఉసురు తీసిందని డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు కొనసాగాయని ఆమె ఆన్నారు .

English summary
The TRS government took the lives of 20 students as it is more concentrated on winning 16 Lok Sabha seats, rather than on State affairs after winning the Assembly elections, alleged BJP leader D.K Aruna . She criticised that the State government had violated several norms and handed over the responsibility of intermediate results to Globarena Technologies Private Limited, which belongs to one of the closest associates of TRS working president of KT Rama Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X