వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు డీఎస్ కృతజ్ఞతలు: కేంద్రమంత్రి పాశ్వాన్‌ను కలిసిన ఈటెల(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజకీయ, పరిపాలనా విషయాలలో అపారమైన అనుభవం ఉన్న ధర్మపురి శ్రీనివాస్‌కు ప్రభుత్వ సలహాదారుగా అప్పగించిన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విజయం సాధిస్తారనే నమ్మకం తనకు ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులైన డి శ్రీనివాస్ శనివారం సిఎంను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అంతర్రాష్ట్ర వ్యవహారాల విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండి, ఇరుగు పొరుగు రాష్ర్టాలతో సమన్వయంతో వ్యవహరించి తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని డిఎస్ తెలిపారు.

బియ్యం కోటా పెంచండి: పాశ్వాన్‌కు ఈటెల వినతి

తెలంగాణకు అదనంగా బియ్యం కోటా పెంచాలని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌ను రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆ శాఖ కమిషనర్ రజత్‌కుమార్‌తో కలిసి ఆయన కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు.

రాష్ర్టానికి మరో 68 వేల 500 మెట్రిక్ టన్నులు కేటాయించాలని, వీటికి కిలోకు 8.43 రూపాయల చొప్పున ఇచ్చినా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సంక్షేమ హాస్టళ్లకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న బియ్యం కోటాను 3442 మెట్రిక్ టన్నుల నుంచి 9018 టన్నులకు పెంచాలని విన్నవించారు.

పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు పరిష్కరించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పాశ్వాన్ మాట్లాడుతూ.. తెలంగాణతోపాటు సిఎం కెసిఆర్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని, ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఉద్యమ సమయంలో తన వంతుగా కృషి చేశానని చెప్పారు. కేంద్ర ఆహారశాఖ కార్యదర్శితో ఫోన్లో మాట్లాడి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలను క్లియర్ చేయాలని ఆదేశించారు.

కెసిఆర్-డీఎస్

కెసిఆర్-డీఎస్

రాజకీయ, పరిపాలనా విషయాలలో అపారమైన అనుభవం ఉన్న ధర్మపురి శ్రీనివాస్‌కు ప్రభుత్వ సలహాదారుగా అప్పగించిన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విజయం సాధిస్తారనే నమ్మకం తనకు ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

కెసిఆర్-డీఎస్

కెసిఆర్-డీఎస్

ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులైన డి శ్రీనివాస్ శనివారం సిఎంను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి ఈటెల

మంత్రి ఈటెల

తెలంగాణకు అదనంగా బియ్యం కోటా పెంచాలని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌ను రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోరారు.

మంత్రి ఈటెల

మంత్రి ఈటెల

శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆ శాఖ కమిషనర్ రజత్‌కుమార్‌తో కలిసి ఆయన కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు.

మంత్రి ఈటెల

మంత్రి ఈటెల

రాష్ర్టానికి మరో 68 వేల 500 మెట్రిక్ టన్నులు కేటాయించాలని, వీటికి కిలోకు 8.43 రూపాయల చొప్పున ఇచ్చినా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

కేంద్రమంత్రితో ఈటెల

కేంద్రమంత్రితో ఈటెల

సంక్షేమ హాస్టళ్లకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న బియ్యం కోటాను 3442 మెట్రిక్ టన్నుల నుంచి 9018 టన్నులకు పెంచాలని విన్నవించారు.

కేంద్రమంత్రితో ఈటెల

కేంద్రమంత్రితో ఈటెల

హమాలీ ఛార్జీలను పెంచాలని, కస్టమ్ మిల్లింగ్ చార్జీలు క్వింటాలు రా రైస్‌కు రూ.15 నుంచి 30కి పెంచాలని, బాయిల్డ్ రైస్‌కు రూ. 25 నుంచి 50 రూపాయలకు పెంచాలని కోరారు.

English summary
TRS leader and Telangana Government's special adviser D Srinivas met CM K Chandrasekhar Rao on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X