హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.170 కోట్లు ఈడీ ఖాతాలోకి: హైకోర్టుకు వైయస్ భారతి, జగన్‌కు ఊరట

హైకోర్టులో జగన్, భారతి రెడ్డికి ఊరట లభించింది. అప్పిలేట్ అథారిటీ నిర్ణయం తీసుకునే వరకు జఫ్తు పైన ముందుకు వెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతీ రెడ్డిలు తమ ఆస్తుల అంశంపై కోర్టు గడప తొక్కారు. ఈడీ స్వాధీనం చేసుకున్న తమ ఆస్తుల పైన స్టే విధించాలని కోరారు.

జగన్‌కు షాక్, అసాధారణ నిర్ణయం: రూ.170 కోట్లు ఈడీ ఖాతాలోకి, దిగ్భ్రాంతి, లంచ్ మోషన్..

హైకోర్టులో జగన్, భారతి రెడ్డికి ఊరట లభించింది. అప్పిలేట్ అథారిటీ నిర్ణయం తీసుకునే వరకు జఫ్తు పైన ముందుకు వెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎఫ్‌డిలను అటాచ్ చేయకుండా ఆదేశించాలని, ఈ విషయంలో తాము అప్పీలేట్ అథారిటీకి వెళ్లాలని భావిస్తున్నందున, అంతవరకు స్టే విధించాలని పిటిషన్‌లో జగన్ కోరారు. వాదోపవాదనలు విన్న హైకోర్టు.. జఫ్తు పైన ముందుకు వెళ్లవద్దని ఆదేశించింది.

Relief to YSRCP chief YS Jagan in High Court in DA case.

కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ తగిలిన విషయం తెలిసిందే. జగన్‌కు చెందిన రూ.170 కోట్ల స్థిర, చరాస్తులను ఈడీ పూర్తిగా మూడు రోజుల క్రితం స్వాధీనం చేసుకుంది.

నూటా డెబ్బై కోట్ల రూపాయల విలువైన ఎఫ్‌డీలు, షేర్లను తమ ఖాతాలోకి ఈడీ బదిలీ చేసుకుంది. జగన్‌ అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్‌ అటాచ్‌మెంట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ప్రాధికార సంస్థ ధ్రువీకరించింది. రూ.749 కోట్ల స్థిర, చరాస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఈడీ ఉత్తర్వులను ప్రాధికార సంస్థ సమర్థించింది. స్వాధీనంపై మంగళవారం స్టే విధించడం జగన్‌కు ఊరట అని చెప్పవచ్చు.

English summary
Relief to YSRCP chief YS Jagan in High Court in DA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X