వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దగ్గుబాటి అభిరామ్ ఫోన్ చోరీ: 'రూ.1.5కోట్లు ఇవ్వు.. లేదంటే అవి బయటపెడుతాం'

|
Google Oneindia TeluguNews

Recommended Video

పధకం ప్రకారమే దగ్గుబాటి అభిరామ్ ఫోన్ చోరీ

హైదరాబాద్: నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ కుమారుడు అభిరామ్ పేరు బయటకొచ్చిన సంగతి తెలిసిందే. అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను లీక్ చేసి.. అతను నన్ను లైంగికంగా వాడుకున్నాడని శ్రీరెడ్డి పేల్చిన బాంబు టాలీవుడ్ లో పెనుసంచలనమే అయింది.

సరే, ఇదంతా పక్కనపెడితే.. ఇటీవల దగ్గుబాటి అభిరామ్ ఫోన్‌ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారట. ఆ ఫోన్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలను గుర్తించి.. వాటి ద్వారా అభిరామ్ పై బ్లాక్ మెయిలింగ్‌కు దిగారట. వాటిని లీక్ చేయకుండా ఉండాలంటే.. రూ.1.5కోట్లు చెల్లించాలని ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారట. అయితే అభిరామ్ దీనిపై పోలీసులను ఆశ్రయించడంతో ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు.

రెస్టారెంటులో ఫోన్ చోరీ

రెస్టారెంటులో ఫోన్ చోరీ

వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను ఆలస్యంగా బయటపెట్టారు పోలీసులు. నిందితులు పథకం ప్రకారమే ఓ రెస్టారెంటులో అభిరామ్ ఐఫోన్‌ను దొంగిలించారని వెల్లడించారు. దాని పాస్ వర్డ్ తెలుసుకుని అందులోని ఫోటోలు, వీడియో డేటా సేకరించారని, వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిలింగ్‌కు దిగారని చెప్పారు.

ఇవ్వకుంటే.. సోషల్ మీడియాలో పెడుతామని

ఇవ్వకుంటే.. సోషల్ మీడియాలో పెడుతామని

ఓ ఫేక్ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసి రూ.1.5కోట్లు ఇవ్వాలని, లేదంటే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడుతామని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్టు తెలిపారు. అయితే ఆ ఫోటోలు, వీడియోలకు సంబంధించిన సమాచారం ఏది పోలీసులు వెల్లడించలేదు.

వీరే నిందితులు

వీరే నిందితులు

నిందితులను అరెస్ట్ చేశామని చెప్పిన పోలీసులు వారి పేర్లు వెల్లడించారు. వీరిలో పశ్చిమగోదావరి జిల్లా నేలమర్రుకు చెందిన కె.రఘురామవర్మ, అదే జిల్లా భీమవరానికి చెందిన ఎన్.కార్తీక్, నేలమర్రుకే చెందిన తిరుమలశెట్టి నాగవెంకటసాయి, పశ్చిమగోదావరి జిల్లా పెందుర్రుకు చెందిన పి.చంద్రకిశోర్‌లు ఉన్నారు.

శ్రీరెడ్డి సెటైర్స్

శ్రీరెడ్డి సెటైర్స్

అభిరామ్ ఐఫోన్ చోరీ సంగతి పక్కనపెడితే.. నటి శ్రీరెడ్డి దగ్గుబాటి సురేశ్, అభిరామ్ లపై అడపాదడపా కౌంటర్స్ వేస్తూనే ఉంది. 'సురేష్ మామ ఎలా వున్నావ్, ఆరోగ్యం జాగ్రత్త, ఎండలు బాగా వేస్తున్నాయి బయట, ఇంట్లోనే గమ్మునుండు' అంటూ ఇటీవల తన ట్విట్టర్ ద్వారా వ్యంగ్యాస్త్రాలు సంధించింది శ్రీరెడ్డి.

English summary
Abhiram Daggubati, son of Tollywood producer Suresh Babu, received huge shock last week when he got an anonymous mail demanding 1.5 Crores after his cell phone has been stolen in a restaurant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X