• search
 • Live TV
మంచిర్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రేమ : రక్తం తేలేలా కొట్టారు.. దళిత యువకుడిపై అమానుష దాడి... మూత్రం తాగించే యత్నం..

|

కరోనాకు మందు లేదు.. బహుశా భవిష్యత్తులో కనిపెట్టవచ్చునేమో.. కానీ భారత్‌లో దాన్ని మించి పాతుకుపోయిన వైరస్ ఉంది. అదే కులం. వేల ఏళ్లుగా దీనికి మందు లేదు. వస్తుందన్న గ్యారెంటీ కూడా దాదాపుగా లేదు. పలకరింపులో కులం,పలుకుబడిలో కులం,ప్రేమలో కులం.. ప్రతీ చోటా అది పాతుకుపోయింది. ఫలితం కుల చట్రాల్లో బరిగీసుకుని బతికే సంకుచిత మనుషుల మధ్యలో ఎంతోమంది అమాయకులు రాలిపోతూనే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడెప్పుడో 1968లో కంచికర్ల కోటేశు ఘటన నుంచి ఇప్పటిదాకా దళితులపై జరిగిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. గత ఆరేళ్లుగా తెలంగాణలోనూ అట్రాసిటీ ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. మంథని మధుకర్,జమ్మికుంట రాజేష్,భువనగిరి నరేష్.. ఇలా అనేకం. తాజాగా మంచిర్యాల జిల్లా జన్నారంలో మరో అట్రాసిటీ ఘటన జరిగింది. ది న్యూస్ మినట్ ఈ కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం.. ఓ మాల సామాజిక వర్గానికి చెందిన యువకుడు గౌడ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించినందుకు అతనిపై అమానుషమైన దాడి జరిగింది. అయితే దాడిపై ఇరు వర్గాల వాదనలు భిన్నంగా ఉన్నాయి.

బాధితుడి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు..

బాధితుడి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు..

బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... జన్నారంకు చెందిన ఓ యువకుడు (18), అదే గ్రామానికి చెందిన ఓ యువతి ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అతనిది మాల సామాజిక వర్గం కాగా.. యువతిది గౌడ సామాజికవర్గం. మే 16వ తేదీన పొంకల్ అనే గ్రామ శివారులో ఉన్న ఓ ఆలయం వద్దకు సాయంత్రం 6.30గంటలకు రావాలని యువతి అతనికి కబురు పంపించింది. అనుకున్నట్టుగానే ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు. అయితే ఆ రాత్రి ఇద్దరూ తమ ఇళ్లకు వెళ్లలేదు.

మొదట ఆ యువకుడి స్నేహితులపై దాడి..

మొదట ఆ యువకుడి స్నేహితులపై దాడి..

యువతి కోసం ఆమె కుటుంబ సభ్యులు గ్రామంలోని ప్రతీచోటా గాలించారు. కానీ లాభం లేకపోయింది. మరుసటి రోజు ఆ యువకుడు తన స్నేహితుడైన అబ్దుల్ అనే యువకుడికి తమ లొకేషన్ షేర్ చేశాడు. కొన్ని బిస్కెట్లు,వాటర్ బాటిల్ తీసుకురావాల్సిందిగా చెప్పాడు. ఈ విషయం తెలిసి అబ్దుల్‌పై ముత్యం సాయి,గరిపెట్టి హరీష్ గౌడ్,ప్రశాంత్,అజ్మత్ ఖాన్ అనే నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ఇందులో హరీష్ అనే వ్యక్తి బాధితురాలికి దూరపు బంధువు. అబ్దుల్‌తో పాటు ఆ యువకుడి స్నేహితులను మరికొందరిని పట్టుకుని అతని లొకేషన్ చెప్పాలంటూ దాడికి పాల్పడ్డారు.

దళిత యువకుడిపై దాడి..

దళిత యువకుడిపై దాడి..

అనంతరం ఆ నలుగురూ ఆ లొకేషన్‌కి వెళ్లి దళిత యువకుడిని పట్టుకుని విచక్షణారహితంగా బెల్టులు,కర్రలతో దాడి చేశారు. దుస్తులు విప్పించి ఎండ వేడిలో ఓ బండపై పడుకోపెట్టారు. దాహంతో అల్లాడుతున్న ఆ యువకుడు నీళ్లు కావాలని ఏడుస్తుంటే.. కులం పేరుతో దూషిస్తూ బలవంతంగా మూత్రం తాగించేందుకు ప్రయత్నించారు. అంతేకాదు,పక్కనే ఉన్న ఓ వాగులో అతన్ని ముంచేందుకు ప్రయత్నించారని వెంకటేష్ అనే అతని బంధువు తెలిపాడు.

నిందితులపై కేసు నమోదు..

నిందితులపై కేసు నమోదు..

ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకున్న బాధితుడు.. అక్కడికి 1కి.మీ దూరంలోని జన్నారం పోలీస్ స్టేషన్‌కి చేరుకుని ఫిర్యాదు చేశాడు. వారు తన దుస్తులను చించేశారని.. తక్కువ కులం వాడివి నీకు మా అమ్మాయి ఎందుకు అంటూ కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మే 18న వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వాటితో పాటు సెక్షన్ 323,324,290,506ల కింద కూడా కేసులు నమోదు చేశారు.

  Amrutha Pranay Press Meet After Her Father Maruthi Rao's Last Rites
  కౌంటర్ ఫిర్యాదు.. ట్విస్ట్..

  కౌంటర్ ఫిర్యాదు.. ట్విస్ట్..

  మరోవైపు ఆ యువతి తల్లిదండ్రులు కూడా బాధిత యువకుడిపై కౌంటర్ ఫిర్యాదు చేశారు. అతను మరో ముగ్గురు స్నేహితులతో కలిసి తమ అమ్మాయిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ కేసు కూడా నమోదు చేశారు. ఆ యువతి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొన్ని నెలలుగా ఆ యువకుడు తమ అమ్మాయి వెంట పడుతున్నాడు. ఈ క్రమంలో మే 16న ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి యత్నించాడు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేయడంతో చివరకు ఏ కేసు ఏమవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికైతే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఆ యువకుడి వీపుపై బెల్టు దెబ్బలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  English summary
  a Dalit man from Jannaram in Telangana’s Mancherial district was brutally attacked and forced to drink urine for allegedly being in a relationship with a woman from the Goud community, which is categorised as Backward Caste. The incident took place on May 17.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X