వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్‌తో భేటీ: ప్రాధాన్యత లేదన్న దానం నాగేందర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావును కాంగ్రెస్‌ నేత, మాజీమంత్రి దానం నాగేందర్‌ సోమవారం కలిశారు. కేటీఆర్‌ను తాను వ్యక్తిగత పనుల నిమిత్తమే కలిశానని.. రాజకీయ ప్రాధాన్యత లేదని నాగేందర్‌ స్పష్టం చేశారు.

Danam met KTR

కాగా, కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు గత కొంత కాలంగా కాస్త దూరంగా ఉంటున్న దానం నాగేందర్.. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ కీలక నేత కెటి రామారావును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నయీమ్ కేసు నమోదైన నేపథ్యంలో..

నయీమ్ ఫామ్ హౌస్ పక్కనే దానం ఫామ్ హౌస్ కూడా ఉండటం, పలు సెటిల్ మెంట్లకు దానం నాగేందర్ సహకరించాడని కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఒకప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ నేత కొండపల్లి సీతారామయ్య మరదలు హైమవతికి చెందిన భూమి కబ్జా విషయంలో దానంపై అభియోగాలు నమోదయ్యాయి.

చెన్నమనేని రమేశ్‌కు సీఎం కేసీఆర్ పరామర్శ

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. ఇటీవలే రమేశ్ మాతృమూర్తి, స్వాతంత్య్ర సమరయోధురాలు లలిత కన్నుమూసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం చెన్నమనేని రమేశ్ ఇంటికి వెళ్లారు.

కాగా, గతంలో పలుమార్లు దానం నాగేందర్ టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాను కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని దానం ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజా భేటీ రాజకీయ చర్చకు దారితీసింది.

Danam met KTR

రమేశ్‌ను, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం వెంట మంత్రులు నాయిని నరసింహారెడ్డి, జోగురామన్న, ఎంపీ మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు మంత్రి హరీశ్‌రావు కూడా చెన్నమనేని రమేశ్‌ను పరామర్శించారు.

English summary
Congress leader Danam Nagener met Telangana Minister KTR on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X