వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ లోకి దానం..! ఉత్త‌మ్ తో భేటీ..! ఖైర‌తాబాద్ ఆయ‌న‌కే..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ‌లో రోజుకో రాజ‌కీయ‌ నేత హ‌డావిడి చేస్తున్నారు. తెలంగాణ రాజ‌కీయాల్లో ఇది తిరుగుబాటు దారుల స‌మ‌యం అన్న‌ట్టు త‌యార‌య్యింది. తెలంగాణ వ్యాప్తంగా ఏదో ఒక మూల‌న తిరుగు బాటు దారులు స‌మావేశం పెట్టుకోవ‌డం అదికార పార్టీ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థిని ఓడిస్తామ‌ని ప్ర‌క‌ట‌న చేయ‌డం స‌ర్వ సాధార‌ణంగా మారిపోయింది. గులాబీ పార్టీలో స‌రైన గుర్తింపురాని నాయ‌కులు కూడా త‌మత‌మ‌ సొంత పార్టీలోకి వెళ్లేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే మాజీ కాంగ్రెస్ నేత దానం నాగేంద‌ర్ కూడా గులాబీ పార్టీ పైన తిరుగుబాటు బావుటా ఎగ‌రేసి తిరిగ సొంత పార్టీలోకి చేర‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే పీసిసి చీఫ్ ఉత్త‌మ్ తో నాగేంద‌ర్ భేటీ సంచ‌ల‌నంగా మారింది.

కేసీఆర్ జాబితాలో కొంద‌రికే టిక్కెట్లు..! మ‌రికొంద‌రికి బిస్కెట్లు..!

కేసీఆర్ జాబితాలో కొంద‌రికే టిక్కెట్లు..! మ‌రికొంద‌రికి బిస్కెట్లు..!

అసెంబ్లీ రద్దైన రోజే ఆప‌థ్థ‌ర్మ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు 105 నియోజ‌క వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్రకటించారు. కానీ అందులో దానం నాగేంద‌ర్ పేరు లేదు. దానం నాగేందర్ కోరిన సీట్లలో ప్రస్తుతం అభ్యర్థులను ఖరారు చేయలేదు కేసిఆర్. అయినప్పటికీ దానం సీటెక్కడ అన్నదానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. దానం నాగేదర్ పేరు రెండు సీట్లలో ఏదో ఒక దానిలో ఫైనల్ చేయవచ్చని ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి. తాజాగా ఒక హోటల్ లో దానం నాగేందర్ ఉత్తమ్ తో భేటీ అయినట్లు వార్త‌లు రావ‌డం చర్చనీయాంశమైంది. దానం నాగేందర్ పిసిసి చీఫ్ ఉత్తమ్ తో స‌మావేశం వాస్తవమేన‌ని ఉత్తమ్ సన్నిహితుడొకరు తెలిపారు. వీరిద్దరి సమావేశం ద్వారా దానం నాగేందర్ అతి త్వ‌ర‌లో తిరిగి సొంత గూటికి చేరే చాన్స్ ఉందని స్పష్టం చేశారు.

 దానం కి నో బెర్త్..! తిరుగుబాటు దిశ‌గా నాగేంద‌ర్..!

దానం కి నో బెర్త్..! తిరుగుబాటు దిశ‌గా నాగేంద‌ర్..!

రెండేళ్ల కసరత్తు తర్వాత దానం నాగేందర్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. రెండేళ్ల క్రితమే ఆయన పార్టీలో చేరాల్సి ఉన్నా, కేసిఆర్ త‌గిన సంకేతం ఇవ్వ‌కపోవ‌డంతో వెనుకంజ వేశారు. ఎట్ల కేల‌కు గులాబీ బాస్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో కాంగ్రెస్ పార్టీని కాద‌ని దానం కారెక్కేశారు. దానం నాగేంద‌ర్ కారైతే ఎక్కారు గానీ తాజా అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌నతో ఆయ‌న కంగు తిన్నారు. కేసీఆర్ జాబితాలో దానం పేరు లేక‌పోయిప్ప‌టికి
దానం నాగేందర్ రానున్న ఎన్నికల్లో సికింద‌రాబాద్ లేదా మ‌ల్కాజ్ గిరి పార్ల‌మెంట్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ తరుపున పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. కాని దానం నాగేంద‌ర్ గాని ఆయ‌ని అనుచ‌రులు గాని ఈ అంశాన్ని ద్రువీక‌రించ‌డం లేదు.

 గులాబీ బాస్ కు త‌ల‌నొప్పిగా మారిన స‌ర్థుబాటు..! ఓవ‌ర్ లోడ్ ఐన కార్..!!

గులాబీ బాస్ కు త‌ల‌నొప్పిగా మారిన స‌ర్థుబాటు..! ఓవ‌ర్ లోడ్ ఐన కార్..!!

దానం నాగేంద‌ర్ ను కూడా గులాబీ పార్టీలో స‌ర్థుబాటు చేయ‌డం త‌ల‌కు మింద‌చిన భారంగా కేసీఆర్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.దాంతోపాటు దానం ను మల్కాజ్ గిరి పార్లమెంటుకు పంపుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అలా కాదు దానం సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేస్తారని కూడా ఊహాగానాలు వినబడుతున్నాయి. అయితే దానం మాత్రం తాను ఖైరతాబాద్ లోనే పోటీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఖైరతాబాద్ సీటుపై ఆశలు పెట్టుకుని వర్క్ చేసుకుంటున్న దివంగత నేత పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి ఆందోళనతో ఉన్నట్లు చెబుతున్నారు.

కాంగ్రెస్ లోకి దానం..! ఉత్త‌మ్ భేటీ..!గులాం న‌బీ ఆజాద్ స‌మ‌క్షంలో పార్టీలోకి..!!

కాంగ్రెస్ లోకి దానం..! ఉత్త‌మ్ భేటీ..!గులాం న‌బీ ఆజాద్ స‌మ‌క్షంలో పార్టీలోకి..!!

ముందస్తు నేపథ్యంలో దానం సీటుపై పీఠముడి పడింది. ఖైతారబాద్ సీటును దానం ఆశిస్తున్నారు. కానీ గోషామహల్ లో పోటీ చేయలని దానం ను టిఆర్ఎస్ నాయకత్వం కోరినట్లు తెలుస్తోంది. ఈ రెండు సీట్లు కాకపోతే సికింద్రాబాద్ లేదా మల్కాజ్ గిరి ఎంపి సీటులో దానం కు చాన్స్ ఇవ్వొచ్చని చెబుతున్నారు. వీటిలో ఏ సీటు తీసుకునేందుకు కూడా దానం నాగేంద‌ర్ సుముఖంగా లేర‌ని తెలుస్తోంది. తన‌కు ప‌ట్టున్న ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గాన్ని కాద‌ని ఏ సీటు కేటాయించినా అంగీక‌రించేది లేద‌ని ఆయ‌న చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దానం నాగేంద‌ర్ కు సీటు కేటాయిస్తే తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు తాను సిద్దంగా ఉన్న‌ట్టు సాంకేతాలు ఇస్తున్నారు దానం.

English summary
kcr pre elections members list bringing fluctuation in the trs party. many trs leaders becoming rebellion in the trs. danam nagendar disappointed with kcr decision and he wants to change the party. danam met pcc chief uttam kumar reddy today and he confirmed to shift in to congress party again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X