హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడు వైయస్.. ఇప్పుడు కేసీఆర్: టీఆర్ఎస్‌లో చేరికపై దానం, కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థిపై షాకింగ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

రాజీనామా పై మీడియా తో మాట్లాడిన దానం

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో బడుగుబలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యత లభించిందని దానం నాగేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉందని తెలిపారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అలా లేదని, ఒకే వర్గం చేతుల్లో పార్టీ ఉందని దానం ఆరోపించారు. వైయస్ పాదయాత్ర సమయంలో ఆరు నెలలపాటు ఇంటికి దూరమై పార్టీ కోసం పనిచేశానని చెప్పారు. గులాంనబీ ఆజాద్ కూడా కాంగ్రెస్ పార్టీ బడుగువర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేవారని, కానీ, ఇప్పుడు అలా లేదని చెప్పారు.

కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ప్రకటిస్తే.. ఇక అంతే..

కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ప్రకటిస్తే.. ఇక అంతే..

30ఏళ్ల కాంగ్రెస్ జెండా మోశానని, సైనికుడిలా పనిచేశానని దానం నాగేందర్ చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెబుతున్నారని.. అయితే ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించలేని స్థితిలో పార్టీ ఉందని, ఒకవేళ ఎవరి పేరైనా ప్రకటిస్తే మరో 11మంది సీఎం అభ్యర్థులు అడ్రస్ లేకుండా పోతారని దానం ఎద్దేవా చేశారు.
ఇదీ ఇప్పుడున్న కాంగ్రెస్ పరిస్థితి అని అన్నారు.

వైయస్ లాంటి నేత లేరు

వైయస్ లాంటి నేత లేరు

తనను నమ్మకున్న కార్యకర్తల భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు దానం నాగేందర్ చెప్పారు. తాను ఎప్పుడూ కూడా పార్టీ ప్రతిష్టను దెబ్బతీయలేదని చెప్పారు. వైయస్ లాంటి నేత కాంగ్రెస్‌లో లేరని అన్నారు. వైయస్ బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. తన రాజీనామా లేఖను యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, నేతలు గులాంనబీ ఆజాద్, కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు పంపానని దానం చెప్పారు. మిగితా కీలక నేతలకు ఫోన్ చేసి చెప్పానని తెలిపారు.

అది నా నైజం కాదు: దానం

అది నా నైజం కాదు: దానం

కాంగ్రెస్ పార్టీలో ఉండి హేళనకు గురికావడానికి, దిగజారేందుకు తాను సిద్ధంగా లేనని, అందుకే రాజీనామా చేస్తున్నానని దానం నాగేందర్ తెలిపారు. వ్యక్తిగతంగా తాను ఏ పార్టీ నాయకులను దూషించలేదని చెప్పారు. తాను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై కూడా వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని, అది తన నైజం కాదని చెప్పారు.

వైయస్ తర్వాత కేసీఆరే.. అంటూ ప్రశంసలు

వైయస్ తర్వాత కేసీఆరే.. అంటూ ప్రశంసలు

తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ శ్రమిస్తున్నారని దానం నాగేందర్ అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత బడుగుబలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తూ వారికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నది సీఎం కేసీఆరేనని దానం చెప్పారు. వైయస్ లాగే కేసీఆర్ కూడా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని ప్రశంసించారు. బలహీనవర్గాలకు కులాలవారీగా కేసీఆర్ న్యాయం చేస్తున్నారని చెప్పారు.

కాంగ్రెస్‌లో పీతల్లా వాళ్లు.. ఎదగడనీయడం లేదు

కాంగ్రెస్‌లో పీతల్లా వాళ్లు.. ఎదగడనీయడం లేదు

కాంగ్రెస్ పార్టీలో బడుగుబలహీన వర్గాల నేతలను ఎదగనీయకుండా ఓ వర్గం నేతలు పీతల్లా అడ్డుకుంటున్నారని దానం చెప్పారు. ఆ వర్గం నేతలు ఎవరో మీకు కూడా తెలుసని మీడియాతో అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం జరగడం లేదని అన్నారు. అధికారంలో లేనప్పుడే ఇలా ఉంటే.. అధికారం వస్తే ఇంకేలా ఉంటుందోనని అన్నారు. పార్టీ వీడటంపై నిర్ణయం తీసుకున్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లేది లేదని చెప్పారు.

 టీఆర్ఎస్ పార్టీలో చేరికపై..

టీఆర్ఎస్ పార్టీలో చేరికపై..

అంజన్‌కుమార్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవని దానం స్ఫష్ట చేశారు. అతనికి హైదరాబాద్ అధ్యక్ష పదవి ఇవ్వమని చెప్పిందే తానేనని దానం తెలిపారు. తనకు కూడా కాంగ్రెస్‌లో పదవి ఫైనల్‌ అయింది.. పదవి వచ్చాక పోతే బాగోదని ఇప్పుడు కాంగ్రెస్‌ను నుంచి వెళ్లిపోతున్నానని దానం అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి సేవకుడిలా పనిచేశానని దానం చెప్పారు. ఉత్తమ్‌ను తీసేస్తారనే ప్రచారం జరుగుతోందన్న అంశంపై స్పందిస్తూ.. ఇక ఆయనేం నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. 2013లో తెలంగాణ వస్తుందన్న విషయం తమకే ముందు తెలుసని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరడంపైనా దానం నాగేందర్ స్పష్టత ఇచ్చారు. తాను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినా పదవులు అడగనని అన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి తనకు ఎలాంటి హామీ రాలేదని దానం స్పష్టం చేశారు. అయినా టీఆర్‌ఎస్‌లో పని ఇస్తే చేస్తా.. లేకపోతే కార్యకర్తగా ఉంటానని దానం నాగేందర్‌ తెలిపారు. కాగా, ఆదివారం టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో దానం నాగేందర్ గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

English summary
Former Minister Danam Nagender on Saturday praised Telangana CM K Chandrasekhar Rao for developing state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X