హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్‌కు భారీ షాక్: దానం నాగేందర్ రాజీనామా, టీఆర్ఎస్ పార్టీలోకి?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించారు.

గత కొంత కాలంగా పార్టీకి దూరంగా

గత కొంత కాలంగా పార్టీకి దూరంగా

కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించి, శనివారం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని దానం నాగేందర్ తెలిపారు. కాగా, గత కొంత కాలంగా దానం నాగేందర్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. పార్టీకి అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు.

పార్టీపై అసంతృప్తి

పార్టీపై అసంతృప్తి

ఇటీవల హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అంజన్ కుమార్ యాదవ్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఈ విషయంపైనా తనకు సమాచారం ఇవ్వలేదని దానం కొంత అంసతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.

తగిన ప్రాధాన్యత లేదు

తగిన ప్రాధాన్యత లేదు

కాగా, హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ పార్టీ నేతలపై దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వెళతారని ప్రచారం సాగింది.

 టీఆర్ఎస్ పార్టీలోకి?

టీఆర్ఎస్ పార్టీలోకి?

తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడంతో దానం నాగేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనతోపాటు మరికొంతమంది నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపై శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

English summary
Former minister Danam Nagender resigned to Congress Party on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X