హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్‌కు షాక్, టిఆర్ఎస్‌లోకి దానం నాగేందర్: రాత్రికి రాత్రే చక్రం తిప్పిన డిఎస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి షాకిస్తున్నారు. నిన్నటికి నిన్న (గురువారం) మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. కానీ అనూహ్యంగా ఆయన అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో సోమవారం నాడు దానం నాగేందర్ కారు ఎక్కనున్నారని తెలుస్తోంది. గురువారం పార్టీ వీడనని చెప్పిన దానం.. శుక్రవారం నాటికి టిఆర్ఎస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.

Danam Nagender set to join TRS monday

ఒక్క రోజులోనే నిర్ణయమా?

గురువారం దానం మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, తనకు ఎవరితోను శతృత్వం లేదని చెప్పారు. అంతేకాదు, పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి తాను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

కట్ చేస్తే... శుక్రవారం నాడు దానం నాగేందర్ టిఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన చేరిక ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదని అంటున్నారు. దానంను డి శ్రీనివాస్ అనుచరుడిగా చెబుతారు. అలాంటి డీఎస్ చాలా రోజుల కిందటే కారు ఎక్కారు.

డిఎస్ తెరాసలో చేరినప్పటి నుంచి దానం నాగేందర్ కూడా ఆ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. వాటిని దానం కొట్టి పారేస్తూ వస్తున్నారు. గత పది రోజులుగా దానం కారు ఎక్కుతారనే ఊహాగానాలు మరింతగా వినిపించాయి.

Danam Nagender set to join TRS monday

పదవి... డిఎస్‌తో భేటీ అయ్యాక స్పష్టత!

అయితే, తాను తెరాసలో చేరితే ఇచ్చే పదవి పైన దానంకు హామీ రాకపోవడంతో ఆయన నిన్నటి వరకు కారు ఎక్కే వార్తలను కొట్టి పారేస్తూ వస్తున్నారని తెలుస్తోంది. రాత్రి డి శ్రీనివాస్‌తో దానం భేటీ అయ్యారు. ఆ సమయంలో హామీ వచ్చిందని సమాచారం. దీంతో అనుచరులతో కలిసి తెరాసలో చేరేందుకు దానం సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఆయనకు ఏదైనా చైర్మన్ పదవి వచ్చే అవకాశముందని సమాచారం.

English summary
Congress party senior leader and former minister Danam Nagender set to join TRS monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X