వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దాదాపు నగరమంతా జలమయమైంది. ఎటు చూసినా చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగిపోయాయి. పలుచోట్ల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు, ప్రభుత్వ శిబిరాలకు తరలివెళ్లారు. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే పలువురు వదరల్లో కొట్టుకుని ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా, ద్విచక్ర వాహనంతోపాటు ఓ వ్యక్తి వరదలో కొట్టుకుపోతుంటే.. గమనించిన స్థానికులు ప్రాణాలకు తెగించి కాపాడారు. ఈ ఘటన కర్మాన్ ఘాట్‌లోని శివసాయినగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలకు తెగించి కాపాడారు. చాలా సమయంపాటు శ్రమించి అతడ్ని కాపాడారు. ఆ తర్వాత పోలీసులు కూడా వచ్చి వారికి సాయం చేశారు.
కాగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయిం. దీంతో ఆ ఇద్దరిప ప్రశంసల వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు, వరదలు కారణంగా నగర ప్రజలు ఎవరూ కూడా బయటకి రావడం లేదు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది.

హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద పెద్దగా వస్తున్న వరదలో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 50 మంది మృతి చెందగా, రూ. 6వేల కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగింది. గత కొద్ది రోజులుగా వర్షాల కురుస్తుండటంతో నగర ప్రజలు ఎవరూ బయటికి రాలేకపోతున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులే వారికి ఇంటికి వెళ్ల ఆహరపదార్థాలను అందజేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు సహాయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
మరో మూడ్రోజులపాటు వర్షాలు
ఇప్పటికే కురిసన వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతుంటే.. ఇప్పుడు మరో మూడ్రోజులపాటు వర్షాలు కురుస్తున్నాయని వార్త తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆందోలనకు గురిచేస్తున్నాయి. తెలంగాణ, ఏపీల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తున్నాయి. హైదరాబాద్‌లో మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్ల హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
రానున్న మూడు రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.