వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెటిఆర్‌కు దాసరి ప్రశంసలు, నాలాంటి వాళ్లు పనికి రారు: దాసరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు దర్శకరత్న దాసరి నారాయణ రావు కితాబిచ్చారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా పలు పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

హైదరాబాదును తెలుగు సినిమా కోసమే కాకుండా సినిమా హబ్‌గా మార్చాలన్నారు. రెండు వేల ఎకరాలను సినీ హబ్‌కు కేటాయించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. అందుకోసం తనను సలహాలు అడగడానికి ప్రభుత్వం తనంతట తానే పూనుకొని కమిటీని నియమించడం విశేషం అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలన్నారు. ఆ పరంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకొంటున్నాయని చెప్పారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కొన్ని సూచనలు అడిగిందని చెప్పారు.

Dasari praises Minister KT Rama Rao

ప్రస్తుతం ప్రతి థియేటర్‌లోనూ నాలుగు ఆటలు ఆడిస్తున్నారని, అదనంగా మరో ఆట ఆడించుకొనే అవకాశం ఇవ్వాలని, ఐదో ఆటగా చిన్న సినిమాని ఆడించాలని ప్రతిపాదించామని, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందన్నారు.

రోజూ జరిగే నాలుగు షోలను అయిదు షోలుగా మార్చి.. నాలుగో షోలో చిన్న సినిమాకు కేటాయించాలని కోరితే, మంత్రి కెటిఆర్ బాగా స్పందించారన్నారు. ఏపీలో సినిమాలకు సంబంధించిన మౌళిక వసతులు మరిన్ని కల్పించాలన్నారు. షూటింగుల కోసం పర్మిషన్లు దొరకడం కష్టమవుతోందని, సింగిల్‌ విండో పద్ధతిన అనుమతులు మంజూరు చేస్తే బాగుంటుందన్నారు.

ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరే ఆలోచన లేదని, తన లాంటి వాళ్లు ప్రస్తుత రాజకీయాలకు పనికిరారని, వెళ్తే బురద చల్లించుకొని రావాలని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు.

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ... అతను ముక్కుసూటి మనిషి అని, నిజాయతీగా ఉంటాడని, ఓ మాట ఇచ్చాడంటే దానికి కట్టుబడి ఉండే మనస్తత్వం గలవాడని, అతను రాజకీయాల్లోకి రావడం సంతోషకరమైన విషయమేనని, పవన్‌ రాణిస్తాడనే నమ్మకం ఉందన్నారు.

English summary
Dasari Narayana Rao has praised Telagnana Minister KT Rama Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X