హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెరిగిన సైబర్ కీచకులు: ఫేస్‌బుక్ చాటింగ్‌తో మహిళలకు వేధింపులు, బ్లాక్ మెయిల్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంటర్నెట్ ప్రపంచ గతినే మార్చేసిన ఓ సాధనం. అలాంటి ఇంటర్నెట్‌ను కొంత మంది మంచికి ఉపయోగించుకుంటే, మరికొందరు చెడుకు ఉపయోగించుకుంటున్నారు. తాజాగా నగరంలో ఫేస్‌బుక్, ఇంటర్నెట్ ఆన్‌లైన్ చాటింగ్‌తో మహిళలను వేధిస్తున్న సైబర్ నేరగాళ్లు పెచ్చుమీరుతున్నారు.

నాలుగు నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 50కి పైగా కేసులు నమోదవుతున్నాయంటే సైబర్ నేరగాళ్లు ఏ రేంజ్‌లో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారో అర్ధమవుతోంది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువతుల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన హైదరాబాదీ అబ్దుల్ మజీద్ (21) గతేడాది 200 మంది యువతులను లోబరుచుకుని జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

<strong>200మందితో చాటింగ్: తెలియని వ్యక్తులతో వద్దు, అమ్మాయి అనుకొని యాక్సెప్ట్ చేశా!</strong>200మందితో చాటింగ్: తెలియని వ్యక్తులతో వద్దు, అమ్మాయి అనుకొని యాక్సెప్ట్ చేశా!

అంతక ముందు ఏడాది పాటు జైలు జీవితం గడిపిన మజీద్ వ్యసనాలకు బానిసై యువతులను బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో అతనిపై ఏడు కేసులు నమోదయ్యాయి. కాగా బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న వారంతా 21 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిలే కావడం విశేషం.

<strong>పోర్న్ సైట్లో పెడ్తానని బెదిరింపు, పేరెంట్స్ జాగ్రత్త: కమిషనర్, ధైర్యంగా ఓ అమ్మాయి తల్లి ఫిర్యాదు</strong>పోర్న్ సైట్లో పెడ్తానని బెదిరింపు, పేరెంట్స్ జాగ్రత్త: కమిషనర్, ధైర్యంగా ఓ అమ్మాయి తల్లి ఫిర్యాదు

 Data shows significant rise in cyber crime in Hyderabad

తాజాగా విశాఖపట్నం, గుంటూరు, పానిపట్, బెంగుళూరు నుంచి ఆన్‌లైన్ చాటింగ్ ద్వారా బ్లాక్‌మెయిల్ చేస్తున్న సుమారు 50మందికి పైగా సైబర్ నేరగాళ్లను గుర్తించినట్టు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. గతేడాది 12 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది నమోదైన కేసుల్లో 10 కేసులను తీవ్ర నేరాలుగా పరిగణించబడే విధంగా ఉన్నాయన్నారు.

కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 50కి పైగా కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. గుంటూరుకు చెందిన ఓ యువతి ఫేస్‌ను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్న యువకులను గుర్తించేందుకు ఓ టీమ్‌ను గుంటూరుకు పంపించినట్టు సైబర్ క్రైం ఏసీపీ రఘువీర్ తెలిపారు.

<strong>100మంది అమ్మాయిలు ఫేస్‌బుక్: నగ్నచిత్రాలతో టెక్కీ విద్యార్థి బ్లాక్‌మెయిల్ </strong>100మంది అమ్మాయిలు ఫేస్‌బుక్: నగ్నచిత్రాలతో టెక్కీ విద్యార్థి బ్లాక్‌మెయిల్

పరువుపోతుందని కొందరు యువతులు ఫిర్యాదులు చేయడం లేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీపీ వివరించారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో మహిళలు, యువతులు తమ ఫోటోలు, వివరాలను పంపవద్దని ఆయన సూచించారు.

English summary
Data shows significant rise in cyber crime in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X